అమెరికాలో భారతీయుడిపై దాడి.. నువ్వు ముస్లింవా అని అడిగి ఆపై..
ABN , Publish Date - Jul 15 , 2026 | 07:43 PM
అమెరికాలో సోమవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూటా రాష్ట్రంలో సోహైల్ అనే భారతీయుడిని ఓ వ్యక్తి 15 సార్లు కత్తితో దారుణంగా పొడిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో సోమవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూటా రాష్ట్రంలో సోహైల్ అనే భారతీయుడిని ఓ వ్యక్తి 15 సార్లు కత్తితో దారుణంగా పొడిచాడు. నిందితుడిని 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సన్‌గా పోలీసులు గుర్తించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, వెస్ట్ వ్యాలీ నగరంలోని ఒక షాపింగ్ మాల్‌లో సోహైల్ పని చేస్తున్నాడు. సోమవారం షాపింగ్ మాల్‌కు వచ్చిన లార్సన్ అతడితో మాట్లాడటం ప్రారంభించాడు. అతడి మతం ఏమిటని అడిగాడు. తాను ముస్లిం అని సోహైల్ చెప్పాక నిందితుడు తనకో మినరల్ వాటర్ బాటిల్ కావాలని అడిగాడు.
ఈ క్రమంలో సోహైల్ వెనక్కు తిరగగానే లార్సన్ తన వద్ద ఉన్న కత్తితో అతడిని ఏకంగా 15 సార్లు పొడిచాడు. ఈలోపు అక్కడున్న వారు వెంటనే స్పందించి లార్సన్‌ను నేలపై పడదోసి అదుపు చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి సాల్ట్ లేక్ కౌంటీ జైలుకు తరలించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోహైల్ పరిస్థితి విషమంగా ఉంది. అతడి చికిత్సకు అయ్యే ఖర్చు కోసం గోఫండ్‌మీ పేజీని కూడా ఏర్పాటు చేశారు. సోహైల్ చాలా స్నేహశీలి అని అతడి స్నేహితులు, సహోద్యోగులు చెప్పారు. కష్టపడి పనిచేసే సోహైల్‌కు తాను ఇటీవలే ప్రమోషన్ కూడా ఇచ్చానని షాపింగ్ మాల్ మేనేజర్ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
హసీనా వస్తే స్వాగతిస్తాం.. కానీ ఉరిశిక్ష తప్పదు: బంగ్లాదేశ్ సంచలన వ్యాఖ్యలు!
ఇరాన్‌పై మరోసారి అమెరికా వైమానిక దాడులు.. 260 మందికి గాయాలు..