హసీనా వస్తే స్వాగతిస్తాం.. కానీ ఉరిశిక్ష తప్పదు: బంగ్లాదేశ్ సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jul 15 , 2026 | 01:56 PM
షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లటంపై ఆ దేశ ప్రధాని తారిఖ్ రెహమాన్ అడ్వైజర్ జహీద్ ఉర్ రెహమాన్ స్పందించారు. షేక్ హసీనా నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. బంగ్లాదేశ్‌కు వస్తే ఉరి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది తన స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశానికి తిరిగి వెళ్లి 'అవామీ లీగ్' పార్టీని మళ్లీ బలోపేతం చేయాలని హసీనా భావిస్తున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లటంపై ఆ దేశ ప్రధాని తారిఖ్ రెహమాన్ అడ్వైజర్ జహీద్ ఉర్ రెహమాన్ స్పందించారు. షేక్ హసీనా నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. బంగ్లాదేశ్‌కు వస్తే ఉరి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ... ‘హసీనా రాకను స్వాగతిస్తున్నాం. ఆమెను ఉరి తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉరి శిక్షను ఆపడానికి హసీనా ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయవాదులను ఢాకాకు రప్పించుకోవచ్చు. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ICT-BD)లో జరిగే విచారణ అత్యంత పారదర్శకంగా ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ పరిశీలకులు కూడా పర్యవేక్షించవచ్చు. కోర్టులో సరైన వాదనలు జరిగితే గతంలో హసీనాకు పడిన ఉరిశిక్ష తీర్పును సవరించే అవకాశం ఉంది. ఆమె నిర్దోషిగా కూడా విడుదల కావచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై దాఖలైన పిల్.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
అట్లాంటాలో తానా మరో కొత్త కార్యక్రమం