త్వరగా వచ్చేయండి.. అంతర్జాతీయ విద్యార్థులకు యూఎస్ యూనివర్సిటీ సూచన
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:47 PM
యూఎస్‌లోని అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి నాలుగేళ్ల అడ్మిషన్ కాలపరిమితి నిబంధన మరో నెలలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులకు కీలక సూచన చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌లోని అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి నాలుగేళ్ల అడ్మిషన్ కాలపరిమితి నిబంధన మరో నెలలో అమల్లోకి రానున్న ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం కీలక సూచన చేసింది. కొత్త రూల్స్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆలోపే అమెరికాకు చేరుకోవాలని అంతర్జాతీయ విద్యార్థులకు యూనివర్సిటీ సూచించింది. ఎఫ్-1 స్టూడెంట్స్‌తో పాటు జే-1 విద్యార్థులు, జే-1 స్కాలర్లనూ ఈ మేరకు అప్రమత్తం చేసింది.
ఎందుకీ సూచన..
ట్రంప్ సర్కారు ఇటీవల విద్యార్థుల చదువులకు సంబంధించి నాలుగేళ్ల గరిష్ఠ కాలపరిమితిని తీసుకొచ్చింది. చదువు పూర్తి చేసుకునేందుకు ఇంతకుమించి సమయం కావాలనుకున్న వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో యూనివర్సిటీ నిర్ణయం మేరకు విద్యార్థులకు కోర్సు పూర్తి చేసేందుకు అదనపు సమయం లభించేది. అయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న అంతర్జాతీయ విద్యార్థుల కోసం అమెరికా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. దీని ప్రకారం సెప్టెంబర్ 15 నాటికే యూఎస్‌కు చేరుకున్న అంతర్జాతీయ విద్యార్థులు తమ కాలపరిమితి పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
అయితే, సెలవులు లేదా ఇతరత్రా కారణాలతో సొంత దేశాలకు వెళ్లిన వారు సెప్టెంబర్ 15 తరువాత తిరిగి వెళ్లితే మాత్రం కొత్త నిబంధనలు వర్తిస్తాయి. కోర్సు పూర్తి చేసుకునేందుకు అదనపు సమయం కావాల్సి వస్తే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అదనపు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీసా గ్రేస్ పీరియడ్‌కు సంబంధించి కూడా మార్పులు రానున్నాయి. సెప్టెంబర్ 15 నాటికి అమెరికాలో ఉంటున్న అమెరికా ఎఫ్-1 వీసా విద్యార్థులకు మునుపటి వలెనే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సెప్టెంబర్ 15 తరువాత అమెరికాకు వెళ్లిన ఎఫ్-1 వీసా విద్యార్థులకు గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు పరిమితం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
హెచ్-1బీలో కొత్త మార్పులు.. వైట్ హౌస్ సమీక్ష పూర్తి! ఫీజులు పెరుగుతాయా?
టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు