Share News

ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బీ వీసాలో రాబోయే మార్పులు ఇవే

ABN , Publish Date - Mar 31 , 2026 | 08:52 PM

హెచ్-1బీ వీసాకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి పలుమార్పులు రాబోతున్నాయని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బీ వీసాలో రాబోయే మార్పులు ఇవే
H-1b Visa Changes From April 1

ఇంటర్నెట్ డెస్క్: వసలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అన్ని రకాల వీసా నిబంధనలనూ కఠినతరం చేసింది. హెచ్-1బీ వీసాకు సంబంధించి కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచీ అమల్లోకి రానున్నాయి. వీసా దరఖాస్తు ప్రక్రియ, సమీక్ష, ఎంపికలకు సంబంధించిన పలు నిబంధనలు అమల్లోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా వలసలు, పౌరసత్వ సేవల విభాగం తెలిపిన దాని ప్రకారం, ఏప్రిల్ 1 నుంచీ కొత్త ఐ-129 ఫామ్‌లతో మాత్రమే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాత ఫారాలతో చేసే దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. అయితే, కాకుండా ఇకపై హెచ్-1బీ వీసా దరఖాస్తుల్లో లబ్ధిదారులు, వారు చేయబోయే ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఏయే బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందో తెలియజేయాలి. తమ ఫీల్డ్ ఆఫ్ స్టడీ, ఇతర విద్యార్హతల గురించి కూలంకషంగా తెలియజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన మరింత కఠినతరం కాబోతున్నదని అనేందుకు ఇది సంకేతమని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు.


హెచ్-1బీ వీసాదారుల ఎంపికకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచీ వేతన ఆధారిత విధానం అమల్లోకి రానుంది. అధిక శాలరీలు, నైపుణ్యాలు ఉన్న వారికి వీసా అవకాశాలు పెరిగేలా మార్పులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, హెచ్-1బీ వీసా కావాలనుకునే వారు తమ నైపుణ్యాలను పెంచుకోవడంతో పాటు అధిక శాలరీలు ఇచ్చే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే అవకాశాలు మెరుగవుతాయని అంటున్నారు. ఇక అమెరికా వెలుపల ఉన్న అభ్యర్థులను కొత్తగా హెచ్-1బీకు స్పాన్సర్ చేసే కొన్ని సందర్భాల్లో సంస్థలు లక్ష డాలర్ల అదనపు ఫీజు చెల్లించాలని ట్రంప్ సర్కారు ఆదేశించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలూ చదవండి:

మాకు సాయం చేయలేదుగా.. ఇక మీ క్రూడ్ ఆయిల్‌ను మీరే తెచ్చుకోండి: ట్రంప్

ఉక్రెయిన్‌‌ను సాయం కోరిన గల్ఫ్ దేశాలు! ఇరాన్‌కు చెక్ పెట్టే డీల్!

Updated Date - Apr 02 , 2026 | 05:34 PM