ఆ గ్రీన్ కార్డుల కోటా పూర్తి కావొచ్చు.. అలర్ట్ చేసిన యూఎస్
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:52 PM
భారత్ కోసం ఉద్దేశించిన ఉద్యోగ ఆధారిత ఈబీ-1 గ్రీన్ కార్డుల కోటా సెప్టెంబర్ నెలాఖరు కంటే ముందే పూర్తి కావొచ్చంటూ యూఎస్ హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ కోసం ఉద్దేశించిన ఉద్యోగ ఆధారిత ఈబీ-1 గ్రీన్ కార్డుల వార్షిక కోటా సెప్టెంబర్ నెలాఖరు కంటే ముందే పూర్తి కావొచ్చంటూ యూఎస్ హెచ్చరించింది. అధిక డిమాండ్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే గ్రీన్ కార్డు కోటా ప్రకారం జారీ పూర్తి కావొచ్చని పేర్కొంది. ఆ తరువాత ఇవి అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. గొప్ప నైపుణ్యాలున్న సిబ్బంది, ప్రొఫెసర్లు, పరిశోధకులు, మల్టీనేషనల్ కంపెనీల ఉన్నతాధికారుల కోసం ఈబీ-1 ఆధారిత గ్రీన్ కార్డులు జారీ చేస్తారన్న విషయం తెలిసిందే.
సెప్టెంబర్ నెల వీసా బులిటెన్‌లో యూఎస్ విదేశాంగ శాఖ ఈ విషయాలను వెల్లడించింది. ఈబీ-1 గ్రీన్ కార్డుకు డిమాండ్ అధికంగా ఉందని పేర్కొంది. భారత్ నుంచి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. ఫలితంగా ఏడాది పూర్తయ్యేలోపే వార్షిక కోటా పూర్తి కావొచ్చని పేర్కొంది. ఆ తరువాత ఇవి అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన మేరకు సర్దుబాట్లు చేస్తున్నామని కూడా పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో తాజా హెచ్చరిక భారతీయులను మరింత అనిశ్చితిలోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతీయులకు ఈబీ-2 కేటగిరీ ఇప్పటికే అందుబాటులో లేనట్టు సెప్టెంబర్ బులిటిన్‌లో పేర్కొన్నారు. ఈబీ-3 గ్రీన్ కార్డు కోసం దరఖాస్తుదారులు ప్రస్తుతం దాదాపు 12 ఏళ్ల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
కేర్ టేకర్ కాలు పట్టుకున్న మొసలి.. ఓ గంట తర్వాత..
మహిళా సిబ్బందిని వద్దనడంతో వివాదం.. ఈఫిల్ టవర్ మూసివేత