Share News

మహిళా సిబ్బందిని వద్దనడంతో వివాదం.. ఈఫిల్ టవర్ మూసివేత

ABN , Publish Date - Sep 08 , 2026 | 10:38 AM

బాప్స్ బృందం ఈఫిల్ టవర్ సందర్శన సందర్భంగా మహిళ సిబ్బంది కనిపించకూడదంటూ ఆదేశాలు అందినట్టు ఆరోపణలు రావడంతో సోమవారం సిబ్బంది నిరసన చేపట్టారు.

మహిళా సిబ్బందిని వద్దనడంతో వివాదం.. ఈఫిల్ టవర్ మూసివేత
BAPS France Tour

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో బాప్స్ బృందం పర్యటన వివాదానికి దారితీసింది. బాప్స్ బృందం ఈఫిల్ టవర్ సందర్శన సందర్భంగా మహిళా సిబ్బంది కనిపించకూడదంటూ ఆదేశాలు అందినట్టు ఆరోపణలు రావడంతో సోమవారం సిబ్బంది నిరసన చేపట్టారు. దీంతో, ఈఫిల్ టవర్ సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఆలయం ప్రారంభోత్సవం కోసం గత వారం బాప్స్ బృందం ఫ్రాన్స్‌‌లో పర్యటించింది. అనంతరం వారు ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళ సిబ్బంది వారికి కనిపించకుండా మరో చోటుకు వెళ్లాలని ఆదేశాలు అందినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొన్ని కౌంటర్ల వద్ద మహిళా సిబ్బంది స్థానంలో పురుషులను పెట్టినట్టు కార్మిక యూనియన్లు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై బాప్స్ కూడా స్పందించింది. సాధారణ పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాము ఈఫిల్ టవర్ సందర్శనను ప్లాన్ చేశామని తెలిపింది. ఫ్రాన్స్‌లోని బుస్సీ, సెయింట్ జార్జి ప్రాంతంలో ఈ బాప్స్ హిందూ దేవాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


ఫ్రాన్స్‌లోని బుస్సీ, సెయింట్ జార్జి ప్రాంతంలో బాప్స్ హిందూ దేవాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భారత్‌ను తెప్పించిన రాళ్లతో ఫ్రెంచ్ ఇంజినీరింగ్ విధానాలను మేళవించి దేవాలయాన్ని నిర్మించారు. భారత కళానైపుణ్యానికి ఫ్రాన్స్ సాంకేతికతను జోడించి ప్రాజెక్టు చేపట్టామని బాప్స్ పేర్కొంది. మహంత్ స్వామి మహరాజ్ నేతృత్వంలో మూర్తి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలమంది భక్తులు పాల్గొన్నారు.

France.jpg


ఈ వార్తలనూ చదవండి:

నేపాల్ బాలుడి కన్నీటి గాథ.. తిరిగిరాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు..

ఇంధన ధరలు భారీ స్థాయిలో తగ్గుతాయి: డొనాల్డ్ ట్రంప్

Updated Date - Sep 08 , 2026 | 11:36 AM