దక్షిణ కరోలినాలో భూకంపం.. స్వల్పంగా దెబ్బతిన్న ఎయిర్‌పోర్టు
ABN , Publish Date - Nov 29 , 2026 | 09:00 AM
దక్షిణ కరోలినాలో (యూఎస్ఏ) శనివారం భూకంపం సంభవించింది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కరోలినాలో (యూఎస్ఏ) శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5గా తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా లాస్ఏంజెలెస్ ఎయిర్‌పోర్టు స్వల్పంగా దెబ్బతిన్నది. ఎయిర్‌పోర్టు అద్దాలు పగిలిపోయాయి. మాన్‌హట్టన్ బీచ్‌కు కొద్ది దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తరువాత కూడా ఆ ప్రాంతంలో కొంత సేపు ప్రకంపనలు కొనసాగాయి.
ఎయిర్‌పోర్టులో డెల్టాఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం లాండవుతున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో, చివరి నిమిషంలో ల్యాండింగ్‌ను విమానం విరమించుకున్నది. విమానం చివరి నిమిషంలో ల్యాండింగ్ చేయకుండా వెనుదిరగడం మంచి నిర్ణయమని రాష్ట్ర గవర్నర్‌తో పాటు లాస్ఏంజెలెస్ నగర మేయర్ కారెన్ బాస్ కూడా వ్యాఖ్యానించారు.
భూకంపం కారణంగా లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. ఒక్కసారిగా ఎయిర్‌పోర్టు మొత్తం కదిలిపోవడంతో కంగారు పడ్డ ప్రయాణికులు ఆ తరువాత కొంత సేపటికి తేరుకున్నారు. ఓ చోట అగ్నిప్రమాదం కూడా జరిగింది. ఆ తరువాత దాన్ని సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అయితే, భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని నగర అగ్నిమాపక శాఖ తెలిపింది. కాలిఫోర్నియాలో తరచూ భూకంపం సంభిస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. పలు భూఫలకాలు కలిసే ఈ ప్రాంతంలో భూకంపాలు సహజమేనని చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!