ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాల్సిందే: మాజీ సీఐఏ చీఫ్
ABN , Publish Date - Apr 13 , 2026 | 09:32 AM
అదుపు తప్పిపోయిన ట్రంప్‌ను వెంటనే అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని మాజీ సీఐఏ చీఫ్ జాన్ బ్రెన్నన్ అన్నారు. ట్రంప్‌తో ప్రజలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదుపు తప్పిపోయారని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సీఐఏ మాజీ చీఫ్ జాన్ బ్రెన్నన్ అన్నారు. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని సూచించారు. ఇందుకోసం యూఎస్ రాజ్యంగంలోని 25వ అమెండ్‌మెంట్‌ను (రాజ్యాంగ సవరణ) ఉపయోగించుకోవాలని కూడా సూచించారు. ఇటీవల ఒక అమెరికా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా త్రివిధ దళాలకు అధిపతిగా ట్రంప్ మరింత కాలం పాటు పదవిలో కొనసాగితే ప్రజలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. నాగరికతను అంతం చేస్తామన్న ట్రంప్ వార్నింగ్ ఇందుకు నిదర్శనమని చెప్పారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మరణించినా, రాజీనామా చేసినా లేక అభిశంసనకు గురైనా ఆ బాధ్యతలను తాత్కాలికంగా వైస్‌ప్రెసిడెంట్ చేపట్టాల్సి ఉంటుంది. ఇక వైస్‌ప్రెసిడెంట్ పోస్టు భర్తీకి సంబంధించిన విధివిధానాలు కూడా ఈ అధీకరణలో ఉన్నాయి. అయితే, ట్రంప్ అభిశంసన అసాధ్యమని కూడా అమెరికా రాజకీయాల విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధ్యక్షుడు వాన్స్‌తో పాటు ఇతర మంత్రివర్గ సభ్యులందరూ ట్రంప్‌కు అండగా, విధేయులుగా ఉన్నారని చెబుతున్నారు.
అమెరికా-ఇరాన్ చర్చలు అర్థాంతరంగా ముగిసిపోవడంతో గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ నౌకాశ్రయాలకు రాకపోకలు సాగించే అన్ని నౌకలను హోర్ముజ్‌లో అడ్డుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. భారత కాలమానం ప్రకారం, నేటి సాయంత్రం 7.30 గంటల నుంచి అమెరికా సెంట్రల్ కమాండ్ హోర్ముజ్‌ను దిగ్బంధించనుంది.
ఈ వార్తలనూ చదవండి:
నైజీరియాలో ఘోరం.. చిన్న పొరపాటుతో 100 మంది మృతి..
యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్.. ఏ పొరపాటు చేసినా..