యూఎస్ సీక్రెట్ సర్వీస్ సూచన.. తాత్కాలికంగా వైట్‌హౌస్ లాక్‌డౌన్
ABN , Publish Date - Nov 09 , 2026 | 09:56 PM
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేత సౌధానికి కొద్ది దూరంలో ఓ వ్యక్తి కారుతో స్తంభాన్ని సోమవారం ఢీకొట్టాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముందుజాగ్రత్తగా శ్వేతసౌధాన్ని కొంతసేపు లాక్‌డౌన్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేత సౌధానికి కొద్ది దూరంలో ఓ వ్యక్తి కారుతో స్తంభాన్ని సోమవారం ఢీకొట్టాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా శ్వేతసౌధాన్ని కొంతసేపు లాక్‌డౌన్ చేశారు. శ్వేతసౌధంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఘటన అనంతరం సీక్రెట్ సర్వీసు అధికారులు, నేషనల్ గార్డ్ ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని డ్రైవర్ ప్రతిఘటించినట్టు కూడా తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, లాఫాయెట్ స్క్వేర్ వద్ద ఫుట్‌పాత్‌పై కారులో దూసుకొచ్చిన డ్రైవర్ అక్కడున్న స్తంభాన్ని ఢీకొట్టాడు. వెంటనే కారులోంచి దట్టమైన పొగలు వచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది సూచనల మేరకు శ్వేతసౌధాన్ని కొంతసేపు లాక్‌డౌన్ చేశారు.
అధికారులు ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? డ్రైవర్ లక్ష్యం ఏమిటి? అన్న విషయాలపై స్పష్టత లేదు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? కావాలనే కారును క్రాష్ చేశారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్! యూఎస్ మంత్రి హెచ్చరికలు
చర్చలు, దౌత్యంతోనే యద్ధానికి పరిష్కారం.. జెలెన్‌స్కీతో ఫోన్‌లో మోదీ