40 మంది అమెరికా పౌరసత్వాలు రద్దు
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:36 AM
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ప్రభుత్వం 40 మంది విదేశీయులకు ఇచ్చిన పౌరసత్వాలను రద్దు చేసింది. వీరిలో ఒకరు భారతీయుడు ఉన్నారు.
వారిలో ఒకరు భారతీయుడు
వేలిముద్రలతో దొరికిపోయిన బల్వీందర్ సింగ్
వాస్తవాలు దాచిపెట్టడంతో
అమెరికా ప్రభుత్వం చర్యలు
వాషింగ్టన్, అక్టోబరు 6: ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ప్రభుత్వం 40 మంది విదేశీయులకు ఇచ్చిన పౌరసత్వాలను రద్దు చేసింది. వీరిలో ఒకరు భారతీయుడు ఉన్నారు. మిగిలిన వారు నేపాల్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, మెక్సికో, చైనా, కంబోడియా తదితర దేశాల వారు ఉన్నారు. హత్యల వంటి ఘోరమైన నేరాలు చేయడం, విదేశాలకు ఏజెంట్లుగా పనిచేసి దేశ రహస్యాలను విక్రయించడం, దివ్యాంగుడిపై తీవ్రమైన లైంగిక దాడి చేయడం వంటి ఆరోపణలు కోర్టుల్లో రుజువు కావడంతో ఈ చర్య తీసుకొంది. వారికి పౌరసత్వాన్ని కల్పిస్తూ ఇచ్చిన న్యాచురలైజేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. వారిపై ‘డీ-న్యాచురలైజేషన్’ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది. తప్పుడు మార్గాల ద్వారా పౌరసత్వం పొందడంతో కాలిఫోర్నియాకు చెందిన బల్వీందర్ సింగ్‌పై ఈ చర్య తీసుకున్నట్టు అసిస్టెంట్ అటార్నీజనరల్ బ్రెట్ ఎ షుమేట్ సోమవారం చెప్పారు. బల్వీందర్ తొలుత 1992లో ఇమ్మిగ్రేషన్ దరఖాస్తును సమర్పించాడు. వాస్తవాలను దాచిపెట్టి 2003లో మరో పేరుతో దరఖాస్తు ఇచ్చి పర్మినెంట్ రెసిడెంట్ హోదాను సంపాదించాడు. రెండో దరఖాస్తు ఆధారంగా ఆయనకు 2009లో అమెరికా పౌరసత్వం లభించింది. వేలిముద్రలను తనిఖీ చేసినప్పుడు రెండు దరఖాస్తులు ఒకటే అని తేలాయి. దాంతో తప్పుడు సమాచారం ఇచ్చి పౌరసత్వం పొందడం, నైతికల విలువలు లేవన్న ఆరోపణతో ఆయన సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అమెరికా నేవీలో పనిచేసినప్పటికీ పుట్టిన దేశమైన చైనాకు రహస్యాలను విక్రయించాడన్న నేరంపై జించావో వీ పౌరసత్వాన్ని రద్దు చేసింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డా ఆ నేరాన్ని దాచి పెట్టినందుకు ఓ మహిళ పౌరసత్వం రద్దయింది.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్