Share News

పశ్చిమాసియాలో పారాట్రూపర్ల మోహరింపు.. అమెరికా భారీ సైనిక వ్యూహం

ABN , Publish Date - Mar 31 , 2026 | 07:21 AM

పశ్చిమాసియాలో అమెరికా వేల సంఖ్యలో పారాట్రూపర్లను మోహరించింది. వ్యూహాత్మక ప్రాంతాలకు వీరిని తరలించింది. మిత్రదేశాలకు రక్షణ, అమెరికా ప్రయోజనాలను కాపాడటమే దీని లక్ష్యమని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి.

పశ్చిమాసియాలో పారాట్రూపర్ల మోహరింపు.. అమెరికా భారీ సైనిక వ్యూహం
US paratroopers Middle East

ఆంధ్రజ్యోతి, మార్చి 31: ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా పశ్చిమాసియాలో తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా వేలాది మంది యూఎస్ ఆర్మీ పారాట్రూపర్లు ఆ ప్రాంతానికి చేర్చింది. ఈ తాజా పరిణామం పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరతను అదుపు చేయడానికా లేక రాబోయే పెద్ద యుద్ధానికి సన్నాహమా అనే చర్చకు దారితీస్తోంది.

పశ్చిమాసియాలోని తమ మిత్రదేశాలకు రక్షణ కల్పించడం, అమెరికా ప్రయోజనాలను కాపాడటమే ఈ మోహరింపు ప్రధాన ఉద్దేశ్యమని పెంటగాన్ వర్గాలు పేర్కొన్నాయి. గగనతలం, భూభాగంపై పట్టు సాధించే సామర్థ్యం ఉన్న పారాట్రూపర్లను పంపడం ద్వారా అమెరికా తన సైనిక సంసిద్ధతను చాటుతోంది.


ఇరాన్, దాని మద్దతు గ్రూపులు దాడులకు పాల్పడకుండా హెచ్చరించడం. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, తక్కువ సమయంలో స్పందించేందుకు ఈ ఎలైట్ ఫోర్స్ సహాయపడుతుంది. తద్వారా ఇజ్రాయెల్ లేదా ఇతర మిత్ర దేశాలకు అమెరికా వెన్నంటే ఉందనే సంకేతాన్ని ట్రంప్ ప్రభుత్వం పంపిస్తోంది. ఈ మోహరింపు రక్షణ చర్యల్లో భాగమేనని అధికారులు చెబుతున్నప్పటికీ, అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం దీన్ని ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సైనిక కదలికగా అభివర్ణిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

Updated Date - Mar 31 , 2026 | 07:42 AM