ఇరాన్‌పై అమెరికా దాడులు.. అణు విద్యుత్ కేంద్రం వద్ద భారీ పేలుళ్లు..
ABN , Publish Date - Jul 10 , 2026 | 07:06 AM
నిన్న (గురువారం) అమెరికా, ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున ఇరాన్‌లోని అణు విద్యుత్ కేంద్రం బుషెహర్ ప్లాంట్‌పై అమెరికా మిస్సైల్ దాడులు చేసింది. దీంతో అణు ప్లాంట్ ఆవరణలోని ఓ భవనం దెబ్బతింది.
టెహ్రాన్, జులై 10: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మూడో రోజుకు చేరుకుంది. నిన్న (గురువారం) అమెరికా, ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున ఇరాన్‌లోని అణు విద్యుత్ కేంద్రం బుషెహర్ ప్లాంట్‌పై అమెరికా మిస్సైల్ దాడులు చేసింది. దీంతో అణు ప్లాంట్ ఆవరణలోని ఓ భవనం దెబ్బతింది. అమెరికా మిస్సైల్ దాడి చేసిన వెంటనే ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు వెంటనే స్పందించి ఎదురుదాడి చేశాయి. పరస్పర దాడుల కారణంగా ఆ ప్రాంతం మొత్తం పేలుళ్ల శబ్దాలతో హోరెత్తింది.
ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉన్న 'బుషెహర్' ప్రాంతంతో పాటు చోగడక్, బందర్ అబ్బాస్, వ్యూహాత్మక ఓడరేవు ఉన్న కొనారక్ ప్రావిన్స్‌లలో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. బుషెహర్ నగర శివార్లలోని మిలిటరీ ప్రధాన కార్యాలయంపై కూడా మిస్సైల్ దాడి జరిగింది. గడిచిన 48 గంటల్లో ఇరాన్ తీరప్రాంతాల్లోని దాదాపు 170కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్‌ను దెబ్బతీసేందుకే ఈ చర్యలు ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎయిమ్స్
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు