Share News

భారత్‌ సహా 17దేశాలపై10 శాతం దిగుమతి సుంకం

ABN , Publish Date - Jul 25 , 2026 | 03:12 AM

భారత్‌ సహా 17 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 10% సుంకాలను విధించింది. ఈ సుంకాలు అత్యధిక లేక బలవంతపు శ్రమతో...

భారత్‌ సహా 17దేశాలపై10 శాతం దిగుమతి సుంకం

బలవంతపు శ్రమతో ఉత్పత్తైన వస్తువులపై విధింపు: అమెరికా

  • మరో 16 దేశాలపై కూడా..

  • వెట్టిచాకిరీతో తయారైన వస్తువులపై విధింపు

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌, జూలై 24: భారత్‌ సహా 17 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 10% సుంకాలను విధించింది. ఈ సుంకాలు అత్యధిక లేక బలవంతపు శ్రమతో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. గత నెలలో వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 301 ప్రకారం.. భారత్‌ సహా ఇతర దేశాలపై అమెరికా 12.5ు సుంకాలను విధించింది. అయితే, భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అత్యధిక శ్రమతో ఉత్పత్తి అయ్యే వస్తువుల దిగుమతిని భారత్‌ నిషేధించింది. ఈ మేరకు ఒప్పందంలో చేసిన సవరణను అమెరికా పరిగణనలోకి తీసుకుంది. టారి్‌ఫను 10శాతానికి తగ్గించింది. కాగా, ట్రంప్‌ సర్కారు ఈ బలవంతపు శ్రమ అన్న కారణంతోనే 43 దేశాలపై 12.5% సుంకాలు విధించింది. ఇవి శుక్రవారం నుంచే అమల్లోకి రానున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక సమస్యలపై దృ‌ష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన

అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 03:14 AM