Share News

రెండేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్ అధికారులు

ABN , Publish Date - Jan 25 , 2026 | 05:37 PM

రెండేళ్ల చిన్నారిని ఆమె తండ్రితో సహా యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల మినియాపోలిస్‌లో అదుపులోనికి తీసుకుంది.

రెండేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్ అధికారులు
2 year old was taken custody

మినియాపోలిస్: అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల చర్య మరోసారి కలకలం సృష్టించింది. రెండేళ్ల చిన్నారిని ఆమె తండ్రితో సహా యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) గత గురవారంనాడు మినియాపోలిస్‌లో అదుపులోనికి తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఈ ఘటనను ధ్రువీకరించింది.


మినియాపోలిస్ సిటీ కౌన్సిల్ సభ్యుడు జాసన్ చావెజ్ చెప్పిన వివరాల ప్రకారం, రెండేళ్ల క్లోయి రెనెటా టిపాన్, ఆమె తండ్రి ఎల్విస్ జోయెల్‌లు ఒక కిరాణా దుకాణం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక కారు వారిని వెంబడించింది. కారు అద్దాలు పగులగొట్టిన ఇమిగ్రేషన్ అధికారులు ఆ ఇద్దరిని కిడ్నాప్ చేశారు. అనంతరం సౌత్ మినియాపోలిస్‌కు తీసుకువెళ్లారు.


ఈ ఘటనపై డీహెచ్ఎస్ ప్రతినిధి మాట్లాడుతూ, రెండేళ్ల చిన్నారి, ఆమె తండ్రి ఈక్వెడార్‌కు చెందిన వారని, వాళ్లు దేశంలో అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. వారిని అదుపులో తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించినప్పుడు కారు తలుపు తెరిచేందుకు ఎల్విస్ నిరాకరించారని, అధికారులు ఆ చిన్నారిని అక్కడే ఉన్న తల్లికి అప్పగించేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించిందని చెప్పారు. కాగా, చిన్నారి నిర్బంధం నుంచి బయటపడినట్టు ఆ కుటుంబ న్యాయవాది కీరా కెల్లీ తెలిపారు.


ఇదే తరహా ఘటన మిన్నిసోటలో ఇటీవల చోటుచేసుకుంది. లియామ్ కోనెజో రామోస్ అనే ఐదేళ్ల బాలుడు ప్రీస్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఫెడరల్ ఏజెంట్లు అతనిని తండ్రితో సహా అదుపులోకి తీసుకుని టెక్సాస్ డిటెన్షన్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. అయితే బాలుడు ఐసీఈ టార్గెట్ కాదని, బాలుని తండ్రి ఈక్వెడార్ నుంచి అక్రమంగా అమెరికాలో ఉంటున్నాడని హోమ్‌ల్యాండ్ విభాగం వివరణ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

భూగర్భ బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ

హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్! ఇక ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదే..

Updated Date - Jan 25 , 2026 | 05:42 PM