భూగర్భ బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:25 PM
ట్రంప్ జారీ చేసిన హెచ్చరికతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దుర్బేధ్యమైన భూగర్భ బంకర్ లోకి వెళ్లిపోయారు. ఈ బంకర్‌లో టన్నెల్స్ సిరీస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని టెహ్రాన్‌లోని పలు సొరంగాలకు అనుసంధానం చేసినట్లు సమాచారం.
ఆంధ్రజ్యోతి, జనవరి 25: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దుర్బేధ్యమైన భూగర్భ బంకర్ లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తన భద్రతా అధికారులు, సైనిక అధికారుల నుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆయన ఈ పని చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.
ఇరాన్ దేశం మీద అమెరికా దాడి చేసే ప్రమాదం పెరిగిందనే హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌లోని భూగర్భ బంకర్‌కు (ఫోర్టిఫైడ్ అండర్‌గ్రౌండ్ షెల్టర్) మారారని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది. ఈ బంకర్‌లో టన్నెల్స్ సిరీస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని టెహ్రాన్‌లోని పలు సొరంగాలకు అనుసంధానం చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ తన కార్యాలయ బాధ్యతలను తన మూడో కుమారుడు మసూద్ ఖమేనీకి అప్పగించినట్లుగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా ఆయనే చూడనున్నట్లు తెలిపాయి. అయితే, ఈ వార్తలపై ఇరాన్ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం చేసిన ప్రకటన తర్వాత ఇరాన్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. సదరు ప్రకటనలో 'అమెరికన్ షిప్స్ ఇరాన్ సమీప జలాల వైపు వెళ్తున్నాయి, వాటిని ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తున్నాను' అని ట్రంప్ చెప్పారు. ఈ ప్రకటన మీద ఇరాన్ నేతలు, అధికారులు మండిపడ్డారు. ఖమేనీపై దాడి జరిగితే జిహాద్ ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి:
20ల్లో ఉండగానే జాబ్‌కు యువకుడి రాజీనామా! ఏఐ వచ్చేసిందంటూ వార్నింగ్
మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్