Share News

ఈబీ 5 వీసా దరఖాస్తు ఫీజు రెట్టింపు

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:39 AM

అమెరికాలో పెట్టుబడులు పెట్టి గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస హోదా) పొందాలనుకునే విదేశీయుల కోసం ఉద్దేశించిన ‘ఈబీ-5 ఇన్వెస్టర్‌ ప్రోగ్రామ్‌’(ఈబీ 5 వీసా) దరఖాస్తు ఫీజును అమెరికా ప్రభుత్వం రెట్టింపు చేసింది

ఈబీ 5 వీసా దరఖాస్తు ఫీజు రెట్టింపు
EB 5

రూ.3.52లక్షల నుంచి 7.30లక్షలకు పెంపు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 30: అమెరికాలో పెట్టుబడులు పెట్టి గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస హోదా) పొందాలనుకునే విదేశీయుల కోసం ఉద్దేశించిన ‘ఈబీ-5 ఇన్వెస్టర్‌ ప్రోగ్రామ్‌’(ఈబీ 5 వీసా) దరఖాస్తు ఫీజును అమెరికా ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఫీజును 3,675డాలర్ల(రూ.3.52లక్షలు) నుంచి 7,615(రూ.7.30లక్షలు) డాలర్లకు పెంచింది. ఈ కొత్త ఫీజు నవంబరు 30 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పెట్టుబడుల విలువలో ఎలాంటి మార్పులు చేయలేదు. గ్రామీణ లేదా ఉద్యోగాలు ఎక్కువగా అవసరం ఉన్న ప్రాంతాల్లో 8లక్షల డాలర్లు(రూ.6.6కోట్లు), సాధారణ ప్రాంతాల్లో 10లక్షల డాలర్లు(రూ.8.7కోట్లు) ఇన్వెస్ట్‌ చేయాలి. ఈ పెట్టుబడుల ద్వారా అమెరికన్‌ పౌరులకు కనీసం 10 ఉద్యోగాలు కల్పించాలి. అప్పుడే ఈబీ 5 వీసా ప్రోగ్రామ్‌ కింద గ్రీన్‌కార్డు లభిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

విమానాన్ని కూల్చేందుకు పైలట్ ప్రయత్నించాడా..

Updated Date - Oct 01 , 2026 | 03:44 AM