హోర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ లేదు: అమెరికా సెంట్రల్ కమాండ్
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:49 AM
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ఇరాన్‌ను దెబ్బతీసేందుకే తాము దాడులు చేస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, మే నెల నుంచి హోర్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని తెలిపింది.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన శాంతి ఒప్పందం నెల రోజులు కాకుండానే ముగిసిపోయింది. రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ సైన్యం దాడులు చేసింది. దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీశాయి. గత మూడు రోజుల నుంచి రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. నిన్న (గురువారం) తెల్లవారుజామున ఇరాన్‌లోని అణు విద్యుత్ కేంద్రం బుషెహర్ ప్లాంట్‌పై అమెరికా మిస్సైల్ దాడులు చేసింది.
అందుకే ఇరాన్‌ను టార్గెట్ చేశాం
గడిచిన 48 గంటల్లో ఇరాన్ తీరప్రాంతాల్లోని దాదాపు 170కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ఇరాన్‌ను దెబ్బతీసేందుకే తాము దాడులు చేస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, మే నెల నుంచి హోర్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని తెలిపింది. 800 వాణిజ్య నౌకలు, 380 మిలియన్ బ్యారెళ్ల చమురును హోర్ముజ్ దాటించామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.
హోర్ముజ్‌లో పరిస్థితి మళ్లీ మొదటికి..
అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. జూన్‌లో కుదిరిన తాత్కాలిక ఒప్పందం సమయంలో రోజుకు దాదాపు 34 నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఒకటి, రెండు నౌకలు మాత్రమే జలసంధిని దాటుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. ముడి చమురు, ఎల్పీజీ తీసుకెళుతున్న 9 భారతీయ ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయాయి. తొమ్మిది ట్యాంకర్లలో 198 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఆ ట్యాంకర్లు జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
‘మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో’.. జగన్‌పై చింతా మోహన్ సెటైర్
300 రూట్‌లో 3-4 నిమిషాలకో బస్సు!