రూ.5 లక్షల కోట్లతో.. లక్షలాది డ్రోన్ల కొనుగోలు!
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:42 AM
యుద్ధరంగంలో డ్రోన్లకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ రక్షణ వ్యూహాన్ని సమూలంగా మార్చేలా ఏకంగా...
అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్, జూన్ 2: యుద్ధరంగంలో డ్రోన్లకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ రక్షణ వ్యూహాన్ని సమూలంగా మార్చేలా ఏకంగా రూ.5లక్షల కోట్ల(54బిలియన్ డాలర్లు)తో లక్షలాది సంఖ్యలో డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. యుద్ధానికి అవసరమైన డ్రోన్లను అతి తక్కువ ధరలో తయారు చేసేందుకు గాను అమెరికా ప్రభుత్వం ఇప్పటికే స్టార్ట్‌పలు, డ్రోన్ల కంపెనీలకు ‘డ్రోన్ డామినెన్స్’ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే మొదటి రౌండ్ పూర్తి అయింది. ఇందులో 26 కంపెనీలు పాల్గొన్నాయి. వీటిల్లో బ్రిటన్‌కు చెందిన స్కైకట్టర్ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. దీంతో, అమెరికా ఈ కంపెనీకి 2,500డ్రోన్లను తయారీ కాంట్రాక్టును అప్పగించింది.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News