రష్యాపై వెయ్యికిపైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:31 AM
రష్యాపై ఉక్రెయిన్ వెయ్యికిపైగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు కీవ్ ప్రయోగించిన 822 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా రక్షణ శాఖ..
మంటల్లో కాలిపోతున్న మాస్కోలోని
వైల్డ్‌బెర్రీస్ లాజిస్టిక్స్ హబ్
మాస్కో/కీవ్, ఆగస్టు 16: రష్యాపై ఉక్రెయిన్ వెయ్యికిపైగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు కీవ్ ప్రయోగించిన 822 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ డ్రోన్ దాడుల్లో రష్యావ్యాప్తంగా ఏడుగురు మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అలాగే రష్యా అతిపెద్ద ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం వైల్డ్‌బెర్రీస్ లాజిస్టిక్స్ హబ్ తీవ్రంగా దెబ్బతింది. మాస్కోకు 45 కిలోమీటర్ల దూరంలో కొలెడినోలో ఉన్న 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ భారీ గిడ్డంగిపై డ్రోన్లు కూలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. డొమెడొడెవోలో ఓ విమానాశ్రయం పక్కనే ఉన్న వైల్డ్‌బెర్రీస్ మరో గిడ్డంగికి కూడా మంటలంటుకున్నాయి. ‘రష్యా అమెజాన్’గా పేరొందిన వైల్డ్‌బెర్రీస్ గోడౌన్లను సైనిక పరికరాలు, డ్రోన్ల విడి భాగాల రవాణాకు ఉపయోగిస్తున్నారని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ఉక్రెయిన్... వీటిని లక్ష్యంగా చేసుకునే దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్ దాడులతో మాస్కోలోని పలు విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ వ్యాప్తంగా 8 మంది మరణించారు.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు