ఉక్రెయిన్ రాజధానిలో కలకలం.. ఆరుగురి మృతి..
ABN , Publish Date - Apr 19 , 2026 | 09:44 AM
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన దారుణ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురిని హతమార్చాడు. అనంతరం ఒక సూపర్ మార్కెట్‌లోకి చొరబడి పలువురిని బందీలుగా చేసుకున్నాడు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన దారుణ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురిని హతమార్చాడు. అనంతరం ఒక సూపర్ మార్కెట్‌లోకి చొరబడి పలువురిని బందీలుగా చేసుకున్నాడు. ఈ సంఘటన కీవ్‌లోని హొలోసీవ్‌స్కీ ప్రాంతంలో జరిగింది. మొదట రోడ్డుపై ఉన్న సాధారణ ప్రజలపై కాల్పులు జరిపిన దుండగుడు, తరువాత సమీపంలోని సూపర్‌మార్కెట్‌లోకి వెళ్లి అక్కడున్న వారిని బంధించాడు (Ukraine shooting Kyiv).
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. దుండగుడితో చర్చల కోసం సుమారు 40 నిమిషాల పాటు ఎదురుచూశారు. అయినా అతడు స్పందించకపోవడంతో, చివరకు కాల్చి చంపారు. ఈ ఘటనలో 10కి పైగా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం (Kyiv supermarket attack).
58 ఏళ్ల దుండగుడు ముందుగా తన నివాసానికి నిప్పంటించుకున్నాడు (Gunman hostage crisis Ukraine). ఆ తర్వాత ఆయుధంతో బయటకు వచ్చి కాల్పులు జరిపాడు. ఈ ఘటనను ఉక్రెయిన్ భద్రతా సంస్థలు ఉగ్రవాద చర్యగా పరిగణిస్తూ దర్యాప్తు ప్రారంభించాయి. ఈ సంఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దుండగుడి ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..