Share News

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:01 AM

పిల్లలను సోషల్‌ మీడియాలోని హానికరమైన కంటెంట్‌ నుంచి రక్షించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం

  • వచ్చే ఏడాది నుంచి బ్రిటన్‌లో అమలు

లండన్‌, జూన్‌ 15: పిల్లలను సోషల్‌ మీడియాలోని హానికరమైన కంటెంట్‌ నుంచి రక్షించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా యాప్స్‌ ఉపయోగించకుండా త్వరలో నిషేధం విధించనున్నట్లు ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సోమవారం ప్రకటించారు. ఒక దేశ ప్రధానిగా, తండ్రిగా పిల్లల ఆరోగ్యం, సంతోషం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన టెక్‌ కంపెనీలను నియంత్రించడం అంత సులభం కాదని, కానీ సమాజ హితం కోసం ఈ మార్పు అవసరమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వేసవి కాలం నాటికి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త నిబంధనల ప్రకారం.. వాట్సాప్‌ వంటి పర్సనల్‌ మెసేజింగ్‌ యాప్‌లకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అయితే, అపరిచితులు సులభంగా పిల్లలను కాంటాక్ట్‌ చేసే అవకాశం ఉన్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ సర్వీసులు, లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లపై మాత్రం కచ్చితమైన వయస్సు ధ్రువీకరణ విధానాన్ని తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా

Updated Date - Jun 16 , 2026 | 05:01 AM