Share News

హోర్ముజ్ జలసంధి మూసివేత.. భారత్‌పై తీవ్ర ప్రభావం తప్పదా..?

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:52 PM

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రపంచ వాణిజ్యంపై, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడం ఆసియా దేశాలను వణికిస్తోంది.

హోర్ముజ్ జలసంధి మూసివేత.. భారత్‌పై తీవ్ర ప్రభావం తప్పదా..?
Strait of Hormuz news

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రపంచ వాణిజ్యంపై, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడం ఆసియా దేశాలను వణికిస్తోంది. మధ్యప్రాచ్య ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడిన భారతదేశానికి ఇది మరింత చేదు వార్త. ఈ ప్రభావం దేశీయంగా అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు (Strait of Hormuz news).


హోర్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్‌ల మధ్య ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్‌ను, ఒమన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. దాదాపు 167 కిలోమీటర్ల పొడవైన ఈ జలసంధి 33 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు 20 శాతం ప్రతిరోజూ ఈ కారిడార్ గుండా జరుగుతుంది. రోజుకు దాదాపు 22 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఆసియా దేశాలకు సరఫరా అవుతుంది. అలాగే ఖతార్ నుంచి ఎల్‌ఎన్‌జీ భారీగా ఆ మార్గం గుండా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం ఉద్రిక్తతల కారణంగా డజన్ల కొద్దీ ట్యాంకర్లు గల్ఫ్ వెలుపల లంగరు వేసి ఉన్నాయని వార్తలు వస్తున్నాయి (Crude oil price impact).

harmuz3.jpg


భారతదేశం తన ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 55% మధ్యప్రాచ్యం నుంచి దిగుమతి చేసుకుంటుంది. రోజుకు దాదాపు 2.7 మిలియన్ బ్యారెళ్లు ఈ మార్గం గుండానే దిగుమతి అవుతాయి. మనదేశంలో చమురు నిల్వ సామర్థ్యం దాదాపు 74 రోజులకు మాత్రమే సరిపోతుంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తే భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. బ్రెంట్ ముడి చమురు ధర పెరుగుదల నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుంది (Middle East tensions).


ఇక, ఇంధన ధరల పెరుగుదల రవాణా, ఆహారం, తయారీ రంగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మొదలవుతాయి. చమురు కోసం అధికంగా ఖర్చు పెట్టడం సాధారణంగానే రూపాయిని బలహీనపరుతుంది. ఇప్పటికే రూపాయి పతనం కారణంగా దిగుమతుల వ్యయం పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు దెబ్బతింటున్నాయి. ఈ ప్రమాదం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి (Global shipping crisis).

harmuz.jpg


హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడం వల్ల ఇరాన్‌కు కూడా నష్టం వాటిల్లుతుంది (Energy market volatility). ఇరాన్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు నిల్వలను కలిగిన దేశం. చైనా పెద్ద మొత్తంలో ఇరాన్ నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. భారత్‌కు కూడా ఇరాన్ చమురు ఎగుమతి చేస్తుంది. హోర్ముజ్‌ను మూసివేస్తే ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మీ తెలివికి ఛాలెంజ్.. ఈ ఫొటోలో ఉన్న మూడు తప్పులను 10 సెకెన్లలో పట్టుకోండి..

Updated Date - Mar 03 , 2026 | 12:52 PM