కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది దుర్మరణం..
ABN , Publish Date - Jun 28 , 2026 | 08:07 PM
సౌదీ అరేబియాలోని రాస్ తనూరాలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: సౌదీ అరేబియాలోని రాస్ తనూరాలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ ప్రెస్ ఎజెన్సీ తెలిపిన వివరాల మేరకు.. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఆయిల్ కంపెనీ అరామ్‌కోకు చెందిన హెలికాప్టర్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రాస్ తనూరా వద్ద కుప్పకూలింది. దీంతో హెలికాప్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సహాయక చర్యలు మొదలెట్టారు. అయితే, ప్రమాదం కారణంగా అందులో ప్రయాణిస్తున్న 14 మంది చనిపోయారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ధ్రువీకరించింది. చనిపోయిన వారంతా సౌదీకి చెందిన వారేనని తెలిపింది. హెలికాప్టర్ సాంకేతిక లోపం వల్ల కూలిందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం ఇంకా తెలియరాలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన ముడి చమురు రవాణా లోడింగ్‌లను అరామ్‌కో సంస్థ తిరిగి ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
పెను విషాదం.. మలేరియా సోకి ముగ్గురు చిన్నారుల మృతి..
కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్?