ఇరాన్ యుద్ధం.. పాకిస్థాన్‌పై ఇండియా, ఇజ్రాయెల్ కుట్ర: ఆసిఫ్ ఖవాజా
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:17 AM
ఇరాన్ భూ భాగంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాకిస్థాన్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌తో పాకిస్థాన్ 900 కి.మీ.లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంపై దాడులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా తీవ్రంగా ఖండించారు.
ఇరాన్ భూ భాగంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాకిస్థాన్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌తో పాకిస్థాన్ 900 కి.మీ.లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంపై దాడులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ గెలిస్తే పాకిస్థాన్ సామంత రాజ్యంగా మారిపోవాల్సి వస్తుందని, ఈ కుట్రలో భారత్ కూడా భాగమేనని ఆయన ఆరోపించారు. ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల వెనుక జియోనిస్ట్ ప్రణాళిక ఉందన్నారు (Pak minister Khawaja Asif).
అణు ఒప్పందంపై చర్చలకు ఇరాన్ సిద్ధంగానే ఉనప్పటికీ ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయని, ఈ యుద్ధం వల్ల పాకిస్థాన్ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆసిఫ్ ఖవాజా అన్నారు. తమ దేశ సరిహద్దుల వద్ద ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నారని, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి తమ దేశాన్ని సామంత రాజ్యంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే.. భారత్, అఫ్గానిస్థాన్ ఏకమై పాకిస్థాన్‌ను టార్గెట్ చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు (Iran Israel war reaction).
1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచే ఇస్లామిక్ ప్రపంచాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని (India Pakistan geopolitics), అన్ని సంఘర్షణలలో జియోనిజం (యూదు భావజాలం) ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర పోషించిందని ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్‌ను ఎలాగైనా సామంత దేశంగా మార్చాలని ఇజ్రాయెల్ కుట్ర పన్నిందని, అందులో భారత్ కూడా భాగస్వామిగా ఉందని అక్కసు వెళ్లగక్కారు.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
వామ్మో.. క్రీమ్ రోల్స్‌ను ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. తినడానికే భయపడతారేమో..