Share News

పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి నిరాకరణ..

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:09 PM

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఏవైనా తమ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఇరాన్ షరతులు విధించింది.

పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి నిరాకరణ..
Pakistan ship

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే నౌకలు ఏవైనా తమ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఇరాన్ షరతులు విధించింది. ముందస్తు అనుమతులు లేని నౌకలను హోర్ముజ్ గుండా ప్రయాణించడానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌కు చెందిన కంటైనర్ నౌకను (Pakistan ship) ఇరాన్ వెనక్కి పంపించినట్టు ఐఆర్‌జీసీ వెల్లడించింది.


హోర్ముజ్ గుండా ప్రయాణించడానికి ముందుస్తు అనుమతులు లేకపోవడంతో కరాచీ వెళ్తున్న కంటైనర్ నౌకను ఐఆర్‌జీసీ వెనక్కి పంపంచింది (IRGC Navy). ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. హోర్ముజ్ గుండా ప్రయాణించే ప్రతి నౌక, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ సముద్ర యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని, లేకపోతే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.


శత్రు దేశాలకు చెందినవి తప్ప మిగిలిన నౌకలన్నీ హోర్ముజ్ గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది (Hormuz conflict). అయితే తమ నుంచి ముందస్తు అనుమతులు మాత్రం తీసుకోవాలని తేల్చి చెప్పింది. కాగా, ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు పాక్ వేదికగా జరగబోతున్నాయని, ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల నేతలు పాల్గొంటారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు.. అందులో ఏమున్నాయంటే?

యుద్ధంలో మేమే గెలిచాం.. సైనికపరంగా ఇరాన్‌ను అంతమొందించాం: ట్రంప్

Updated Date - Mar 25 , 2026 | 03:10 PM