Share News

ఇరాన్ పెద్ద ప్లానే.. అమెరికా డాలర్‌ను దెబ్బ తీసేందుకు మాస్టర్ ప్లాన్..

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:11 PM

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. హోర్ముజ్ జలసంధిని ఇప్పటికే ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి.

ఇరాన్ పెద్ద ప్లానే.. అమెరికా డాలర్‌ను దెబ్బ తీసేందుకు మాస్టర్ ప్లాన్..
Iran Strait of Hormuz news

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. హోర్ముజ్ జలసంధిని ఇప్పటికే ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఈ హోర్ముజ్ జలసంధిని అడ్డుపెట్టుకుని అమెరికాను గట్టి దెబ్బతీసేందుకు ఇరాన్ పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి (Oil tankers Chinese yuan trade).


చమురు వ్యాపారంలో అమెరికన్ డాలర్‌కు బదులుగా చైనా యువాన్‌లో చెల్లింపులు చేసే ట్యాంకర్లకు మాత్రమే హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రపంచ చమురు వ్యాపార వ్యవస్థలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువగా చమురు చెల్లింపులు అమెరికన్ డాలర్‌లోనే జరుగుతున్నాయి. అందుకే డాలర్ పవర్‌ఫుల్ కరెన్సీ‌గా మారి అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది (Iran oil trade yuan).

iran2.jpg


యువాన్‌లో చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి చైనా కరెన్సీ ప్రభావాన్ని పెంచాలని ఇరాన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బే. ఇరాన్‌కు చైనా మిత్ర దేశమనే సంగతి తెలిసిందే. ప్రస్తుత యుద్ధంలో చైనా పరోక్షంగా ఇరాన్‌కు సహాయ సహాకారలు అందిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఆధిపత్యాన్ని పెంచేందుకు ఇరాన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం (Iran Strait of Hormuz news).


ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి (Strait of Hormuz oil route). గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే చమురులో సుమారు 20 శాతం వరకు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ మార్గాన్ని మూసేస్తే లేదా అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరగడం, ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదం తప్పదు. ఏదేమైనా, చైనా యువాన్‌లో చెల్లింపుల షరతుతో ట్యాంకర్లకు అనుమతి ఇవ్వాలనే ఇరాన్ ఆలోచన ప్రపంచ చమురు రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..


దుబాయ్ ఖాళీ.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే..

Updated Date - Mar 14 , 2026 | 01:17 PM