Share News

ఫ్లైదుబాయ్ ఉదంతం.. ఓ నాటకంలా కనిపిస్తోంది: ఇరాన్

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:55 PM

ఫ్లైదుబాయ్ ఉదంతంలో కుట్ర కోణం కనబడుతోందని ఇరాన్ తాజాగా ఆరోపించింది. ఇజ్రాయెల్ ప్రధాని, యూఏఈ అధ్యక్షుడు ఈ కుట్ర పన్ని ఉంటారని పేర్కొంది.

ఫ్లైదుబాయ్ ఉదంతం.. ఓ నాటకంలా కనిపిస్తోంది: ఇరాన్
Iran on Flydubai incident

ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ ఉదంతంలో కుట్ర కోణం కనబడుతోందని ఇరాన్ తాజాగా ఆరోపించింది. దీని వెనుక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హస్తం ఉన్నట్టు ఆరోపించింది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరలో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర జరిగిందని ఇరాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇరాన్‌పై తదుపరి దాడులకు దీన్ని సాకుగా చూపించవచ్చని కూడా అనుమానం వ్యక్తం చేశాయి.


దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్ విమానంలో ఒమానీ కోపైలట్ కెప్టెన్‌ స్మిత్ మచ్చార్‌పై అకస్మాత్తుగా దాడి చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్టు కనిపిస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే ఆరోపించారు. కాక్‌పిట్‌లోనే పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికి కాక్‌పిట్ తలుపులు మూసే ఉండటంతో బయటివారెవరూ లోపలకు వెళ్లలేకపోయారు. ఈ క్రమంలోనే విమానం క్షణాల వ్యవధిలో 17 వేల అడుగుల మేర కిందకు దిగింది. కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడ్డప్పటికీ కెప్టెన్ స్మిత్ తనశక్తినంతా కూడదీసుకుని కాక్‌పిట్ తలుపులు తెరిచారు. దీంతో, ఇతర ప్రయాణికులు వచ్చి కోపైలట్‌ను నిలువరించి పెను ప్రమాదాన్ని తప్పించగలిగారు.


ఈ వార్తలనూ చదవండి:

హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలి: జేడీ వాన్స్

ఉక్రెయిన్ వార్‌కు మోదీ వద్ద పరిష్కారం: రష్యా అధ్యక్షుడు పుతిన్

Updated Date - Oct 02 , 2026 | 01:10 PM