Share News

మీ యుద్ధం పొరుగువారితో కాదు, తెలివి తెచ్చుకోండి.. ఇరాన్‌కు యూఏఈ హెచ్చరిక

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:46 PM

అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారంనాడు దాడి జరపడం, ఇందుకు ప్రతిగా ఇరాన్ వరుసగా రెండోరోజు కూడా అమెరికా మిత్రదేశాలపై దాడులు జరుపుతుండటంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగుదేశాలపై దాడులు ఎందుకు చేస్తున్నారని ఇరాన్‌ను నిలదీసింది.

మీ యుద్ధం పొరుగువారితో కాదు, తెలివి తెచ్చుకోండి.. ఇరాన్‌కు యూఏఈ హెచ్చరిక
Iran attacks on UAE

అబుదాబీ: అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారంనాడు దాడి జరపడం, ఇందుకు ప్రతిగా ఇరాన్ వరుసగా రెండోరోజు కూడా ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాలపై దాడులు జరుపుతుండటంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగుదేశాలపై దాడులు ఎందుకు చేస్తున్నారని ఇరాన్‌ను నిలదీసింది. మీ యుద్ధం పొరుగుదేశాలతో కాదంటూ హెచ్చరికలు చేసింది.


తొలుత ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలపై దాడులు చేసింది. ఆయా దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టింది. యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ ఆరేబియాలపై దాడులు జరిపింది. దీనిపై యూఏఈ తొలిసారి ఘాటుగా స్పందించింది.


Anwar-gargash.jpg

'గల్ఫ్ దేశాలపై ఇరాన్ దురాక్రమణ ఒక తప్పుడు లెక్క. ఈ చర్య ఇరాన్‌ను ఒంటరిని చేస్తుంది. యూఏఈ వంటి పొరుగుదేశాలు యుద్ధంలో లేవు. తెలివిగా వ్యవహరించాలి' అని యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ అన్నారు.


అరబ్ దేశాలపై దాడెందుకు?

అమెరికా-ఇజ్రాయెల్ శనివారం ఉదయం టెహ్రాన్‌పై భారీ సైనిక చర్య చేపట్టాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, పలువురు ఉన్నత సైనిధికారులు మృతిచెందారు. దాడులు మొదలైన కొద్దిసేపటికే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. దుబాయ్‌లో రెండోరోజైన ఆదివారంనాడు కూడా పేలుళ్లు వినిపించాయి. దుబాయ్ విమానాశ్రయం సమీపంలో దాడి జరగడంతో విమాన సర్వీసులను నిలిపివేశారు. దుబాయ్‌లో ల్యాండ్ ఐలాండ్ పామ్, లగ్జరీ హోటల్ బుర్జ్ అల్ అరబ్‌ వద్ద పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇరాన్ వాయిసేన పెర్షియన్ గల్ఫ్‌దేశాలు, ఇరాక్‌ కుర్దిస్తాన్‌లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు జరిపింది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరేజా అరాఫీ

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?

Updated Date - Mar 01 , 2026 | 06:48 PM