భారత పైలట్ స్మిత్‌మచ్చర్‌కు యూఏఈ అరుదైన గౌరవం
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:39 AM
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ప్రాణాంతక దాడిని చాకచక్యంగా ఎదుర్కొని, 170కి పైగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది
‘ఫస్ట్‌క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ ఐఐ’ పురస్కారంతో సత్కారం
యూఏఈ, అక్టోబరు 28: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ప్రాణాంతక దాడిని చాకచక్యంగా ఎదుర్కొని, 170కి పైగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయనతో పాటు ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఫ్లైట్ సిబ్బందినీ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ ఐఐ’తో సత్కరించింది. ప్రమాదంలో కెప్టెన్ స్మిత్ తీవ్రంగా గాయపడినప్పటికీ, ప్రాణాలకు తెగించి పోరాడినందుకుయూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ అవార్డును ప్రకటించారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో దుబాయ్ యువరాజు హమ్దాన్ మక్తూమ్ పురస్కారాలను అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్
పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి