Share News

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:24 AM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని రాస్‌ అల్‌ ఖైమాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా...

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం

  • ట్రక్కును ఢీకొన్న బస్సు.. 13 మంది దుర్మరణం

  • మృతుల్లో ఒంగోలు యువకుడు సహా ఆరుగురు భారతీయులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని రాస్‌ అల్‌ ఖైమాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, ఇందులో ఒంగోలు జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన బ్రాహ్మణకాక వినోద్‌కుమార్‌(31) సహా మొత్తం ఆరుగురు భారతీయులు ఉన్నారు. వీరంతా ఉద్యోగం కోసం దుబాయి, ఇతర ఎమిరేట్లకు వచ్చి.. ఉద్యోగాలు పొందిన తర్వాత వీసా మార్పిడి కోసం పొరుగున ఉన్న మరో గల్ఫ్‌ దేశమైన ఒమాన్‌కు వెళ్లి వస్తుండగా ట్రక్కును బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మొత్తం 26 మంది గాయపడగా, అందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్యపై సోషల్‌ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని పోలీసులు కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 05:27 AM