ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం
ABN , Publish Date - Sep 23 , 2026 | 03:18 AM
శాంతి ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామని, నరకంలోకి నెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అయితే నవంబరులో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల అనంతరం ఇరాన్‌తో ఒప్పందం కుదరవచ్చని పేర్కొన్నారు
ఒప్పందానికి రాకుంటే
నరకంలోకి నెట్టేస్తాం
ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల
సామర్థ్యాన్ని విస్తరిస్తోంది
దానితో యూరప్‌కు కూడా ప్రమాదం
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య
సమావేశంలో ట్రంప్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. ‘సూపర్ ఇంటెలిజెన్స్’గా
పిలుద్దామని ప్రతిపాదన
న్యూయార్క్, సెప్టెంబరు 22: శాంతి ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామని, నరకంలోకి నెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అయితే నవంబరులో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల అనంతరం ఇరాన్‌తో ఒప్పందం కుదరవచ్చని పేర్కొన్నారు. మంగళవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. ‘‘ప్రస్తుతం ఇరాన్ ముందు రెండు మార్గాలు ఉన్నాయని.. ఒకటి ఒప్పందానికి వచ్చి దేశాన్ని పునర్నిర్మించుకోవడం, రెండోది అమెరికా నుంచి మరిన్ని దాడులను ఎదుర్కోవడం. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేసి త్వరగా ముగించాలా? తిరిగి కోలుకునే ఆశ, అవకాశం లేకుండా నరకంలోకి నెట్టివేయాలా? వాళ్లు ఏం కోరుకుంటున్నారు? అయినా అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఒప్పందం కుదిరే అవకాశం ఉంటుందని భావిస్తున్నా..’’ అని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికల్లో తనకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందోనని ఇరాన్ వేచి చూస్తోందని ట్రంప్ చెప్పారు. ఇరాన్ ఉగ్రవాదానికి మద్ద తు ఇస్తోందని.. తన డ్రోన్లు, క్షిపణుల సా మర్థ్యాన్ని విస్తరిస్తూ వెళుతోందని, అవి యూర్‌పకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోయాయన్న వార్తలను ట్రంప్ ఖండించారు. కాగా, ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో కేవ లం ఒక్కరు మినహా ఇరాన్ ప్రతినిధులంతా సర్వసభ్య సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
కృత్రిమ మేధ కాదు.. సూపర్ మేధ..
కృత్రిమ మేధ(ఏఐ)పై అనవసరపు భయాందోళనలు వద్దని ట్రంప్ పిలుపునిచ్చారు. అంతేకాదు దాని పేరును ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అని కాకుండా ‘సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్‌ఐ)’ వ్యవహరించాలని ప్రతిపాదించారు. కృత్రిమం అన్న పదం మేధస్సును నకిలీదన్న భావన కలిగిస్తోందని.. కానీ నిజానికి అది అద్భుతమైనదని పేర్కొన్నారు. ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాల్లో సూపర్ ఇంటెలిజెన్స్ అనే వినియోగిస్తామని ప్రకటించారు. ఏఐతో ప్రమాదమంటూ వస్తున్న ప్రకటనలన్నీ పథకం ప్రకారమేనని ఆరోపించారు. ‘‘గత కొన్నేళ్లుగా గ్లోబల్ వార్మింగ్ వల్ల మనమంతా చనిపోతామని చెబుతూ వస్తున్న వారే ఇప్పుడు కృత్రిమ మేధ మనందరినీ చంపేస్తుందని, రోబోలు మనపై దాడి చేస్తాయని, ఘోర విపత్తుగా మారుతుందని చెబుతున్నారు. ప్రతి కొత్త భారీ సాంకేతికత కొన్ని సవాళ్లను తీసుకువస్తుంది. అందుకు సూపర్ ఇంటెలిజెన్స్ మినహాయింపు కాదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ పరిశ్రమ వృద్ధికి సహకరిస్తామని ప్రకటించారు.
ఈ వార్తలను చదవండి
ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..
యూనైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం