Share News

యూనైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:31 PM

దిగువ సభకు (స్టేట్ డుమా) జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది.

యూనైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం
United Russia Party Wins Elections

ఇంటర్నెట్ డెస్క్: దిగువ సభకు (స్టేట్ డుమా) జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు పుతిన్ అనుకూల యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది. చెప్పుకోదగిన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడంతో పుతిన్ పార్టీ విజయం నల్లేరుమీద నడకలా మారింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యాలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

రష్యా దిగువ సభలో మొత్తం 450 సీట్లు ఉంటాయి. వీటిలోని సగం సీట్లల్లో పార్టీలు అభ్యర్థులను పోటీలోకి దింపుతాయి. మిగిలిన సగం సీట్లలో (పార్టీ లిస్టు) ప్రజలు నేరుగా పార్టీలనే ఎంచుకుంటారు. పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. 5 శాతానికి దిగువ ఓట్లు సాధించిన పార్టీలకు ఎలాంటి సీట్ల కేటాయింపు ఉండదు.


రష్యా మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకూ 90 శాతం ఓట్ల కౌంటింగ్ పూర్తైంది. డుమాలోని మొత్తం సీట్లలో యునైటెడ్ రష్యా పార్టీకి 355 సీట్లు లభించగా కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ రష్యాకు 40 సీట్లు లభించాయి. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి 25 సీట్లు, న్యూపీపుల్ పార్టీకి 20 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజల మద్దతు పుతిన్‌కు దక్కిందని అధికార పార్టీ ఘనంగా ప్రకటించింది.


ఇదిలా ఉంటే, తాజా విజయంతో పుతిన్ మరింత మంది రష్యన్లను సైన్యంలోకి చేర్చుకునే అవకాశం ఉందన్న భయాలు కూడా ఉన్నాయి. పుతిన్ మాత్రం అలాంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు దిగువ సభతో పాటు రష్యాలోని వివిధ ప్రాంతాలు, పుర పాలక సంస్థలు, గవర్నర్‌ల పరిధిలోని ప్రాంతాలకు ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా పోలింగ్ చివరి రోజున డ్రోన్ డాడులతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. అయితే, ఉక్రెయిన్ దాడులను తాము సమర్థవంతంగా తిప్పి కొట్టామని రష్యా రక్షణ శాఖ తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

Updated Date - Sep 21 , 2026 | 05:29 PM