Share News

ఇరాన్‌తో యుద్ధం.. సైన్యానికి ట్రంప్ కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Mar 01 , 2026 | 10:31 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. సైన్యం అమెరికా ప్రజలకు రక్షణగా నిలబడాలని, ఇరానియన్ పాలన నుంచి పొంచి ఉన్న ముప్పులను తొలగించాలని స్పష్టం చేశారు.

ఇరాన్‌తో యుద్ధం.. సైన్యానికి ట్రంప్ కీలక ఆదేశాలు..
Trump Iran strikes objectives

న్యూయార్క్, మార్చి 1: ఇరాన్‌తో భీకర యుద్ధం కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. సైన్యం అమెరికా ప్రజలకు రక్షణగా నిలబడాలని, ఇరానియన్ పాలన నుంచి పొంచి ఉన్న ముప్పులను తొలగించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘అధ్యక్షుడు సాహసోపేతమైన చర్యకు ఆదేశించారు. ఇరానియన్ పాలన నుంచి పొంచి ఉన్న ముప్పులను తొలగించడం ద్వారా అమెరికన్ ప్రజలను రక్షించడమే మా లక్ష్యం. సెంటకామ్ దళాలు తిరుగులేని, నిరంతరాయమైన దాడిని కొనసాగిస్తున్నాయి’ అని పేర్కొంది.


ఖమేనీ బాధితులకు న్యాయం చేశాం: ట్రంప్

ఖమేనీ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఖమేనీ బాధితులకు న్యాయం చేశాం. ఖమేనీ మృతి ఇరాన్ ప్రజలకే కాదు.. అమెరికన్లకు గొప్ప విజయం. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇదే ఛాన్స్‌. అమెరికా నిఘా, ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారు. ఇరాన్‌లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదు. ఇరాన్‌ సైన్యం మా నుంచి మద్దతు కోరుకుంటోంది. ఇరాన్ ప్రజాస్వామ్యవాదులతో సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్ కలవాలి. అందరూ కలిసి ఇరాన్‌ను గొప్పగా పునర్నిర్మించాలి. శాంతి నెలకొనేవరకు దాడులు కొనసాగుతాయి’ అని రాసుకొచ్చారు.


ప్రతీకారం తీర్చుకుంటాం

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన సంగతి తెలిసిందే. సుప్రీం లీడర్ మరణంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఖమేనీ మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకర దాడులు జరగొచ్చని తెలిపింది.


ఇవి కూడా చదవండి

ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక..

ఇంటి కాలుష్యం... ఇంతింత కాదయా!

Updated Date - Mar 01 , 2026 | 10:40 AM