Share News

ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక..

ABN , Publish Date - Mar 01 , 2026 | 10:16 AM

సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం..  అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక..
IRGC offensive threat

సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడులకు పాల్పడిన వారిపై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ క్యాబినెట్ ఓ ప్రకటన విడుదల చేసింది (Iran retaliation warning).


అలాగే, ఖమేనీ మృతికి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) సంతాపం ప్రకటించింది. తమ సుప్రీం లీడర్‌ను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకర దాడులు జరగొచ్చని హెచ్చరించింది. ఇక, ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలేది లేదని ఇరాన్ క్యాబినెట్ పేర్కొంది. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారులు అలీ షంఖానీతో పాటు ఐఆర్‌జీసీ చీఫ్ మహమ్మద్ పాక్‌పౌర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది (IRGC offensive threat).


మహమ్మద్ పాక్‌పౌర్ మృతి కారణంగా ఐఆర్‌జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్‌గా మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదీ బాధ్యతలు స్వీకరించారు (Tehran revenge vow). కాగా, ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఐఆర్‌జీసీ భారీ దాడులకు సిద్ధమవుతున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌పై దాడులు.. భారత్‌కు భారీ నష్టం తప్పదా..?


బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 01 , 2026 | 10:16 AM