సుప్రీం నేత అలీ ఖమేనీని లేపేద్దాం
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:56 AM
ఇరాన్‌తో యుద్ధమే అనివార్యమైతే ఆ దేశంపై ఎలాంటి మిలిటరీ వ్యూహాలు అమలు చేయొచ్చుననేది అధికారులు కొన్ని ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎదుట...
వారసుడు మొజ్తబా, ముల్లాలనూ అంతం చేద్దాం
ట్రంప్ వద్ద ‘యుద్ధ’ ప్రతిపాదనలు..ఓ వెబ్ పోర్టల్ కథనం
వాషింగ్టన్, ఫిబ్రవరి 21: ఇరాన్‌తో యుద్ధమే అనివార్యమైతే ఆ దేశంపై ఎలాంటి మిలిటరీ వ్యూహాలు అమలు చేయొచ్చుననేది అధికారులు కొన్ని ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎదుట ఉంచారు. ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ, ఆయన వారసుడు మొజ్తబాలను హతమార్చడం సహా పలు ప్రతిపాదనలు వాటిలో ఉన్నట్టు ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికార వర్గాలను ఉటంకిస్తూ ఎక్సివోస్ అనే వెబ్ పోర్టల్ కథనం ప్రచురించింది. ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ, మొజ్తబాలను ఎందుకు లక్ష్యం చేసుకోవాలో చెబుతూ, ఇరాన్‌లో చోటుచేసుకున్న ప్రతి దుశ్చర్యకూ వారిద్దరూ, ముల్లాలే కారణమని ట్రంప్ సీనియర్ సలహాదారు ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ఈ ప్రతిపాదనలపై ఇంతవరకు తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా, ఇరాన్ పాలకుల ఉక్కుపాదం కింద అనతికాలంలోనే 32 వేల మంది బలయిపోయారని ట్రంప్ అన్నారు. నిష్పాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునేదిశగా వెంటనే చర్చలకు సిద్ధం కావాలని ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. ‘‘నిర్బంధంలో ఉన్న వందలాది మంది అసమ్మతివాదులను వధించాలని, వారిని బహిరంగంలో క్రేన్లకు కట్టి ఉరి తీసేందుకు ఇరాన్ పాలకులు ఒక దశలో సిద్ధమయ్యారు. అలాంటి ఒక్క ఘటనకు ఒడిగట్టినా, మరుక్షణమే అమెరికా ప్రతిస్పందన చవిచూస్తారని హెచ్చరించాను. దీంతో 837 మందికి మరణశిక్ష నిలిపివేశారు’’ అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News