Share News

విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ షాక్‌!

ABN , Publish Date - Aug 01 , 2026 | 05:36 AM

అమెరికాలోని విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ట్రంప్‌ ప్రభుత్వం వరుసగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పీజీ అమెరికాలో పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో అక్కడే ఉండాలని...

విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ షాక్‌!

వారిపై లక్ష డాలర్ల పెను భారం

‘ఓపీటీ’పై భారీ ఫీజు యోచనలో అమెరికా

వాషింగ్టన్‌, జూలై 31: అమెరికాలోని విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ట్రంప్‌ ప్రభుత్వం వరుసగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పీజీ అమెరికాలో పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో అక్కడే ఉండాలని, ఏదో ఒక పని చూసుకోవాలని ఆశపడేవారిపై లక్ష డాలర్ల ఫీజు (రూ.95 లక్షలు) విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. కఠిన వలస విధానాల పట్ల అమెరికాకు వెళుతున్న భారతీయులు సహా అంతర్జాతీయ నిపుణులు, విద్యార్థులు ఇప్పటికే ఆందోళనతో ఉన్నారు. కొత్త విధానాన్ని ట్రంప్‌ ఒకవేళ అమల్లోకి తెస్తే, వారి డాలర్‌ కలలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టే. ఉన్నత విద్య కోసం అమెరికాకు అత్యధికంగా వెళుతున్న భారతీయ విద్యార్థుల అవకాశాలకు ఇది శరాఘాతమే కాగలదు. దీనిపై వైట్‌హౌస్‌ వర్గాలు ఆచితూచి స్పందించాయి. వలస విధానంలో ఇప్పటికిప్పుడు మార్పులు ఉండబోవని అంటూనే, విదేశీ విద్యార్థులకు ఉద్దేశించిన ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని మాత్రం చెప్పడం లేదు. అమెరికాలోని విదేశీ విద్యార్థులు స్టెమ్‌ కోర్సుల్లో (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం) పీజీ చేసిన తర్వాత సాధారణంగా ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) పొందుతారు. ఒకటి నుంచి మూడేళ్లు ఉండే ఈ శిక్షణా కాలంలో తమ రంగంలో వారు విశేష నైపుణ్యం పొందుతారు. అమెరికాలోనే మరికొంతకాలం ఉండేలా తమ స్టూడెంట్‌ వీసా పొడిగింపునకు ఈ శిక్షణ వారికి వీలు కల్పిస్తుంది. ఈ క్రమంలోనే హెచ్‌-1బీ వీసాకు కూడా అర్హత సాధించి, అక్కడే ఉండిపోతున్నారు. ఇందులో చాలామంది కొత్త విధానంతో తమ అవకాశాలు కోల్పోతారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 05:36 AM