Share News

ట్రంప్‌ ఫొటోతో యూఎస్‌ పాస్‌పోర్టు

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:29 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్ని సాంప్రదాయాలను బద్దలుకొడుతున్నారు. జూలైలో జరగనున్న అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలను...

ట్రంప్‌ ఫొటోతో యూఎస్‌ పాస్‌పోర్టు

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 29: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్ని సాంప్రదాయాలను బద్దలుకొడుతున్నారు. జూలైలో జరగనున్న అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని పరిమిత సంఖ్యలో అధ్యక్షుడు ఫొటోతో పాస్‌పోర్టులను విడుదల చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలను యూఎస్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్‌ ఎక్స్‌లో ధృవీకరించారు. పాస్‌పోర్టు ఫొటోను కూడా పంచుకున్నారు. దానిలో ఒక వైపు పేజీలో స్వాతంత్య్ర ప్రకటన బ్యాక్‌డ్రా్‌పలో ఉండగా... దానిపై ట్రంప్‌ ఫొటో ఎంబోజ్‌ చేసి ఉంది. దానికింద బంగారు అక్షరాలతో ట్రంప్‌ సంతకముంది. రెండో పేజీలో యూఎస్‌ వ్యవస్థాపక పితామహుల చరిత్రాత్మక ఫొటోను ముద్రించారు. ట్రంప్‌ థీమ్‌తో ఉన్న పాస్‌పోర్టు కేవలం వాషింగ్టన్‌లో, అదీ కాపీలు ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిసింది. కాగా, దేశంలో తొలిసారి అధ్యక్షుడు ట్రంప్‌ సంతకంతో కరెన్సీని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ఖజానా శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 05:29 AM