Share News

ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి మేనిఫెస్టోలో లేని ఆ ఒక్కపేరు..

ABN , Publish Date - Apr 27 , 2026 | 07:16 AM

నిందితుడు కోల్ థామస్ ఎలెన్.. హిల్టన్ హోటల్‌లో కాల్పులకు తెగబడ్డానికి 10 నిమిషాల ముందు తన ఫ్యామిలీకి ఓ మెసేజ్ పంపాడు. ఎలన్.. ట్రంప్ ప్రభుత్వంలోని టాప్ ర్యాంక్ అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరి పేర్లు ఆ మెసేజ్‌లో రాసుకున్నాడు.

ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి మేనిఫెస్టోలో లేని ఆ ఒక్కపేరు..
Trump event shooting

ఇంటర్‌నెట్ డెస్క్: వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ ఎలెన్ ప్రెస్ డిన్నర్‌ జరుగుతున్న వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లోకి చొరబడ్డాడు. బాల్‌రూము బయట కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరిగిన సమయంలో బాల్‌రూములో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలనియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు అమెరికా కీలక నేతలు ఉన్నారు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తం అయ్యారు. ట్రంప్, మెలనియా, జేడీ వాన్స్‌లను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.


మేనిఫెస్టోలో లేని ఆ ఒక్క పేరు ఎవరిది?..

నిందితుడు కోల్ థామస్ ఎలెన్.. హిల్టన్ హోటల్‌లో కాల్పులకు తెగబడ్డానికి 10 నిమిషాల ముందు తన ఫ్యామిలీకి ఓ మెసేజ్ పంపాడు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఆ మెసేజ్‌లో ట్రంప్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారుల పేర్లన్నీ ఉన్నాయి. కానీ, ఆయన పేరు లేదు. ఆయనే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్యప్ ప్రమోద్ పాటెల్ (క్వాష్ పాటెల్). ట్రంప్ ప్రభుత్వంలోని టాప్ ర్యాంక్ అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరి పేర్లు ఎలన్ ఆ మెసేజ్‌లో రాసుకున్నాడు. క్వాష్ పాటెల్ పేరు మాత్రం రాయలేదు. ఎలన్ తన లిస్ట్‌లో రాసుకున్న వారందరినీ కాల్చి చంపడానికి నిశ్చయించుకున్నాడు. కానీ, క్వాష్ పాటెల్ పేరు ఎందుకు రాయలేదన్నది మిస్టరీగా మిగిలిపోయింది.


నిందితుడు తన కుటుంబానికి పంపిన మెసేజ్‌లో.. ‘ప్రాణ నష్టాన్ని తగ్గించడం కోసం నేను స్లగ్స్‌కు (గన్) బదులుగా బక్‌షాట్(గన్) ఉపయోగిస్తాను. ఒకవేళ తప్పనిసరైతే, లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తుల వద్దకు చేరుకోవడానికి ఇక్కడ ఉన్న మెజారిటీ ప్రజలను దాటుకుంటూ వెళ్లడానికైనా నేను వెనుకాడను. కానీ, పరిస్థితి అంతవరకు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని రాసుకున్నాడు.


ఇవి కూడా చదవండి

ప్రాక్టికల్‌ లెర్నింగ్‌కు ప్రాముఖ్యం

బీటెక్‌ ఇన్‌ అప్లయిడ్‌ లైఫ్‌ సైన్సెస్‌

Updated Date - Apr 27 , 2026 | 07:31 AM