Share News

ప్రాక్టికల్‌ లెర్నింగ్‌కు ప్రాముఖ్యం

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:53 AM

యూజీ కోర్సులకు వైఐఎస్‌యు నోటిఫికేషన్స్‌ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ

ప్రాక్టికల్‌ లెర్నింగ్‌కు ప్రాముఖ్యం

యూజీ కోర్సులకు వైఐఎస్‌యు నోటిఫికేషన్స్‌ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ(వైఐఎస్‌యు). ప్రాక్టికల్‌ శిక్షణకు ఇక్కడ ప్రాముఖ్యం ఇస్తున్నారు. అందులో భాగంగా రెండు డిగ్రీ కోర్సులకు నోటిఫికేషన్స్‌ విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్‌తో కలిసి బీఎస్సీ కార్డియోవా స్కులర్‌ సైన్స్‌, పలు ఫార్మా సంస్థలతో కలిసి బీటెక్‌ ఇన్‌ అప్లయిడ్‌ లైఫ్‌ సైన్సెస్‌ టెక్నాలజీని ఆఫర్‌ చేస్తోంది.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ కోర్సుల్లోకి విద్యార్థులను ఎంపిక చేస్తారు.

బీఎస్సీ కార్డియోవాస్కులర్‌ సైన్స్‌ వైద్య చికిత్సకు తోడు పరిశోధనకు పట్టం కట్టే అత్యున్నత సంస్థ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్‌. ఆ సంస్థతో కలిసి అందిస్తున్న కోర్సు బీఎస్సీ కార్డియోవాస్కులర్‌ సైన్స్‌.

  • గుండె అదేవిధంగా రక్తనాళాల నిర్మాణం, పనితీరు, సంబంధిత వ్యాధులను అధ్యయనం చేసే వైద్యశాస్త్ర విభాగమే కార్డియోవాస్కులర్‌ సైన్స్‌.

  • కార్డియోవాస్కులర్‌ సెగ్మెంట్‌లో సంబంధిత వైద్యులకు సహకరించేందుకు తదుపరి వరుసలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సును తీర్చిదిద్దారు.

  • ఈ కోర్సులో భాగమైన నైపుణ్యాలన్నీ ఆసుపత్రిలోనే నేర్చుకోవాల్సి ఉంటుంది. అసుపత్రిలోని సదుపాయాలు అలాగే ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన వృత్తి నిపుణుల నుంచి అన్నీ తెలుసుకోవాలి. అందుకనే ఈ కోర్సు మొత్తాన్ని ఆసుపత్రి క్యాంప్‌సలోనే నిర్వహిస్తున్నారు.

  • కోర్సు కాలవ్యవధి మూడేళ్ళు. కనీసం 55 శాతం మార్కులతో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. సీట్లు 50 కాగా కోర్సు ఫీజు ఏడాదికి రూ.లక్ష.

  • కార్డియాక్‌ అనాటమీ, ఫిజియాలజీ, కార్డియోవాస్కులర్‌ వ్యాధులపై ఈ కోర్సులో సమగ్ర అవగాహన కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్‌ కార్డియాక్‌ డయాగ్నస్టిక్‌ పరికరాలు అంటే ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫి, క్యాథ్‌ ల్యాబ్‌ సిస్టమ్స్‌పై శిక్షణ ఉంటుంది. కార్డియాక్‌ పేషెంట్‌ మానిటరింగ్‌, క్లినికల్‌ సపోర్ట్‌ విషయంలో ప్రాక్టికల్‌ స్కిల్స్‌ నేర్పుతారు. ఆరు సెమిస్టర్ల కోర్సు. మొత్తమ్మీద కార్డియోవాస్కులర్‌ టెక్నాలజీ, రోగి ఆరోగ్యం, హెల్త్‌కేర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌లో సుశిక్షుతులుగా ఈ కోర్సులో చేరిన విద్యార్థులను తీర్చిదిద్దుతారు.


  • ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కార్డియోవాస్కులర్‌ టెక్నాలజిస్టు, ఈసీజీ టెక్నీషియన్‌, ఎకోకార్డియోగ్రఫీ టెక్నీషియన్‌, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌, కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌ టెక్నీషియన్‌, క్లినికల్‌ అప్లికేషన్‌ స్పెషలిస్ట్‌, మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ స్పెషలిస్ట్‌గా జాబ్స్‌ లభిస్తాయి. ఆరంభంలో నెలకు రూ.ఇరవై వేలకు తక్కువ కాకుండా వేతనం అందుతుంది.

  • ఉన్నత విద్యలో భాగంగా ఈ కోర్సు తరవాత ఎమ్మెసీ ఇన్‌ కార్డియోవాస్కులర్‌ టెక్నాలజీ, ఎమ్మెస్సీ ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌/ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌, సైన్సెస్‌, క్లినికల్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రోగ్రామ్‌ చేయవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

For More AP News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 06:53 AM