Share News

బీటెక్‌ ఇన్‌ అప్లయిడ్‌ లైఫ్‌ సైన్సెస్‌

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:49 AM

వై ఐ ఎస్ యు అందిస్తున్న మరో కోర్సు ఇది. సుప్రసిద్ధ ఫార్మా సంస్థలు బయలాజికల్‌ ఇ లిమిటెడ్‌, అరబిందో, లారస్‌ ల్యాబ్స్‌, భారత్‌ బయోటెక్‌, డాక్టర్‌ రెడ్డీ్‌సతో ఈ కోర్సును అందిస్తోంది.

బీటెక్‌ ఇన్‌ అప్లయిడ్‌ లైఫ్‌ సైన్సెస్‌

వై ఐ ఎస్ యు అందిస్తున్న మరో కోర్సు ఇది. సుప్రసిద్ధ ఫార్మా సంస్థలు బయలాజికల్‌ ఇ లిమిటెడ్‌, అరబిందో, లారస్‌ ల్యాబ్స్‌, భారత్‌ బయోటెక్‌, డాక్టర్‌ రెడ్డీ్‌సతో ఈ కోర్సును అందిస్తోంది.

  • కనీసం 55 శాతం మార్కులతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌/బయాలజీతో ఇంటర్‌ లేదా తతస్సమాన పరీక్ష ఉత్తీర్ణులు ఈ కోర్సు చేసేందుకు అర్హులు.

  • కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు(ఎనిమిది సెమిస్టర్లు). సీట్లు 30 కాగా వార్షిక ఫీజు రూ.1,75,000.

  • లైఫ్‌ సైన్సెస్‌/ ఫార్మాస్యూటికల్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇంజనీర్లుగా రాణించేందుకు అవసరమై తర్ఫీదు ఈ కోర్సులో ఉంటుంది.

  • ఇంజనీరింగ్‌ ఫండమెంటల్స్‌, ఫార్మాస్యూటికల్‌ మాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజీస్‌, రెగ్యులేటరీ సైన్సెస్‌, క్వాలిటీ సిస్టమ్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ, డిజిటల్‌ ఫార్మస్యూటికల్‌ మాన్యుఫాక్చరింగ్‌ సిస్టమ్స్‌ను కరికులమ్‌లో ఇంటిగ్రేట్‌ చేశారు. కోర్సులో భాగస్వాములైన ఫార్మా సంస్థల్లోనే విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌, క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్టులు కూడా ఉంటాయి. ఆ విధంగా పరిశ్రమలో నేరుగా పనిచేసేందుకు అవసరమైన ప్రాక్టికల్‌ శిక్షణ ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు అందిస్తారు.

  • ఫార్మాస్యూటికల్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇంజనీర్‌, ఏపీఐ ప్రాసెస్‌ ఇంజనీర్‌, ఫార్ములేషన్‌ డెవల్‌పమెంట్‌ ఇంజనీర్‌, స్టెరైల్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్పెషలిస్ట్‌, వాక్సిన్‌ మాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజిస్ట్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌ ఇంజనీర్‌, క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌, రెగ్యులేటరీ అఫైర్స్‌ స్పెషలిస్ట్‌, ప్రాసెస్‌ వాలిడేషన్‌ ఇంజనీర్‌, బయోఫార్మస్యూటికల్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్పెషలి్‌స్టగా ఈ కోర్సు చేసిన విద్యార్థులు ఫార్మా సంస్థల్లో పనిచేయవచ్చు.

  • ఉన్నత విద్యలో భాగంగా ఎంటెక్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్‌/ బయోప్రాసెస్‌ ఇంజనీరింగ్‌, ఎంబీఏ ఇన్‌ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా రెగ్యులేటరీ అఫైర్స్‌ అండ్‌ క్లినికల్‌ రీసెర్చ్‌లో ప్రోగ్రామ్స్‌ను చేయవచ్చు.

  • ఈ రెండు కోర్సులకు సంబంధించిన వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌ లేదా 8374234139 నంబర్‌కు కాల్‌ చేసి తెలుసుకోవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

For More AP News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 06:49 AM