Share News

సుందర్‌ పిచాయ్‌ ఓ మాన్‌స్టర్‌

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:22 AM

గూగుల్‌ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ను ‘మాన్‌స్టర్‌’ (అసాధారణ వ్యక్తి/గొప్ప వ్యక్తి)గా ట్రంప్‌ అభివర్ణించారు.

సుందర్‌ పిచాయ్‌ ఓ మాన్‌స్టర్‌
trump with sunder

గూగుల్‌ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ను ‘మాన్‌స్టర్‌’ (అసాధారణ వ్యక్తి/గొప్ప వ్యక్తి)గా ట్రంప్‌ అభివర్ణించారు. వైట్‌హౌ్‌సలో ఏఐ కంపెనీలతో సమావేశం అనంతరం మీడియా ఎదుట ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘సుందర్‌ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?’’ అని అడిగారు. దీనికి సుందర్‌ పిచాయ్‌ స్పందిస్తూ.. ‘‘ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌, థాంక్స్‌’’ అని మాట్లాడడం మొదలు పెట్టారు. ట్రంప్‌ మధ్యలోనే జోక్యం చేసుకుని.. ‘‘టెక్‌ రంగానికి చెందిన వీరంతా అత్యంత ప్రముఖులు. ఈయన(సుందర్‌) మాన్‌స్టర్‌. కానీ, ఈయన గురించి ఎవరికీ తెలియదు. పేరు మాత్రం గుర్తు పెట్టుకోండి.. సుందర్‌’’ అని మీడియా ప్రతినిధులతో అన్నారు. దీనికి సుందర్‌ పిచాయ్‌ నవ్వుతూ.. ‘‘నేను మాన్‌స్టర్‌ అనే దానికంటే ఇది (సుందర్‌) మంచి ట్యాగ్‌లైన్‌ అవుతుందని ఆశిస్తున్నా’’అని చమత్కరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక

డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ..

Updated Date - Oct 01 , 2026 | 03:23 AM