శరణార్థుల వర్క్ పర్మిట్లపై ట్రంప్ కఠిన నిబంధనలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:58 AM
వలసదారులపై కఠిన విధానాలు అమలు చేస్తోన్న అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆశ్రయం కోరే వారి(శరణార్థులు) విషయం...
వాషింగ్టన్, ఫిబ్రవరి 21: వలసదారులపై కఠిన విధానాలు అమలు చేస్తోన్న అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆశ్రయం కోరే వారి(శరణార్థులు) విషయంలో ప్రతిపాదిత కొత్త నిబంధనలు వారు వర్క్ పర్మిట్లు పొందడాన్ని మరింత కఠినతరం చేయనున్నాయి. ఈ నిబంధనల ప్రకారం శరణార్థి దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్ల జారీని సుదీర్ఘ కాలం పాటు నిలిపివేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొత్త రూల్ ఖరారైతే.. కొన్ని శరణార్థి దరఖాస్తుల సగటు ప్రాసెసింగ్ సమయం 180 రోజులు లేదా అంతకంటే తక్కువకు చేరుకొనే వరకు కొత్త శరణార్థి దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్లు లభించవు. అంటే దీని ప్రకారం, ఆ కాల పరిమితికి చేరుకోవడానికి, వర్క్ పర్మిట్లు తిరిగి జారీ చేయడం ప్రారంభించడానికి 14 ఏళ్ల నుంచి 173 ఏళ్ల మధ్య ఎంతైనా సమయం పట్టొచ్చనేది ఒక అంచనా! యూఎ్‌ససీఐఎస్ వద్ద ప్రస్తుతం శరణార్థుల వర్క్ పర్మిట్లకు సంబంధించి 14 లక్షల మేర దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ సంఖ్య న్యూహాం్‌పషైర్ రాష్ట్ర జనాభాతో సమానమని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News