థాయ్ రాజకీయాల్లో క్యాషియో వాచ్ హవా.. ఆ దేశ ప్రధానమంత్రి చేతికి అదే
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:12 PM
ఇప్పుడు థాయ్ రాజకీయాల్లో ‘క్యాషియో రాయల్’ అని ముద్దుగా పిలిచే క్యాషియో వాచ్ హవా నడుస్తోంది. 60 డాలర్ల కంటే తక్కువకే వచ్చే ఈ చేతి గడియారాన్ని అత్యంత విలువైనదిగా భావించి, ఇష్టంగా ధరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్ రాజకీయాల్లో వాచ్లకు ఒక ప్రత్యేక స్థానముంది. వీటిని కేవలం వస్తువులుగా కాకుండా అధికారానికి, స్థాయికి చిహ్నాలుగా అక్కడి రాజకీయ నాయకులు భావిస్తారు. అయితే ఇప్పుడు థాయ్ రాజకీయాల్లో క్యాషియో రాయల్ అని ముద్దుగా పిలిచే క్యాషియో ఏఈ1200డబ్ల్యూహెచ్ వాచ్ హవా నడుస్తోంది. 60 డాలర్ల కంటే తక్కువకే వచ్చే ఈ చేతి గడియారాన్ని అత్యంత విలువైనదిగా భావించి, ఇష్టంగా ధరిస్తున్నారు. ఆ దేశ ప్రధాని మంత్రి అనుతిన్ నుంచి ఇతర కేబినెట్ మంత్రుల వరకు అందరి చేతికి ఇదే వాచ్ ఉంటోంది.
ఈ రెట్రో వాచ్‌లో ఉన్న ప్రపంచపటం అధికారానికి చిహ్నమని థాయ్ రాజకీయ నాయకులు అంటున్నారు. ‘ఈ వాచ్‌లను చిన్న షాపుల నుంచి అనుతిన్ తరచూ కొనుగోలు చేస్తారు. ఇటీవల వాటిని మంత్రులందరికీ ఆయన బహూకరించారు. ఆయనకు ఇవి అంటే అంత ఇష్టం’ అని థాయ్‌ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సిరిపోంగ్ అక్కరస్రియుక్ పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు తన దగ్గర 22 లగ్జరీ వాచ్‌లు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రెండు మిలియన్ డాలర్లు ఉంటుందని అనుతిన్ చెప్పారు. ఇటీవలే రోలెక్స్ డే-డేట్ 40 వాచ్‌తో ఆయన కనిపించారు.
వాచ్‌ల కారణంగా వివాదాలు
మరోవైపు థాయ్ రాజకీయాల్లో ఈ వాచ్‌లు పలు వివాదాలకూ కారణమయ్యాయి. 2017లో థాయ్‌ల్యాండ్ ఉప ప్రధానమంత్రి ప్రవిత్ వాంగ్సువాన్ నిత్యం లగ్జరీ వాచ్‌లను ధరించేవారు. దీంతో ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో దర్యాప్తు సంఘాలు విచారణ కూడా చేపట్టాయి. ఇలా వాచ్‌లు ఆ దేశంలో కొన్ని వివాదాలకూ దారి తీశాయి.
ఈ వార్తలూ చదవండి
వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇక ఫొటోలు, మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!
నూతన ఏఐ మోడల్స్‌ను ఆవిష్కరించిన మెటా!