టెక్సాస్ స్కూళ్లలో హెచ్1బీ ఉద్యోగులకు చెక్
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:36 AM
టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్1బీ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోకుండా నిషేఽధం విఽధించనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్...
నిషేధం విధిస్తామన్న రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్
న్యూయార్క్, ఆగస్ట్ 19: టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్1బీ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోకుండా నిషేఽధం విఽధించనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రకటించారు. టెక్సాస్ ప్రభుత్వ పాఠశాలల్లో విదేశీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు, ఒక్క హెచ్1బీ వీసా ఉద్యోగి ఉండరాదన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకురానున్నట్టు మంగళవారం ఆస్టిన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో చెప్పారు. ఇప్పటికే హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న వారితోపాటు, కొత్త వారికీ ఈ నిషేధాన్ని వర్తింపజేయనున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్ర చట్ట సభల ఆమోదంతో ఇది చట్టంగా మారితే.. హెచ్1బీ వీసాపై బోధనా వృత్తిని ఎంచుకున్న భారతీయులకూ టెక్సాస్ ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశాల్లేకుండా పోతాయి.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..