Share News

ఖతార్‌లో భారత రాయబారిగా శ్రీకర్‌రెడ్డి

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:11 AM

ఖతార్‌లో భారత రాయబారిగా తెలుగు దౌత్యవేత్త కొప్పుల శ్రీకర్‌ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. భువనగిరి జిల్లాకు చెందిన ఈయన కాకతీయ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యను...

ఖతార్‌లో భారత రాయబారిగా శ్రీకర్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ఖతార్‌లో భారత రాయబారిగా తెలుగు దౌత్యవేత్త కొప్పుల శ్రీకర్‌ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. భువనగిరి జిల్లాకు చెందిన ఈయన కాకతీయ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. 2001 బ్యాచ్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారి అయిన శ్రీకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి మొదలుకొని ఐక్యరాజ్య సమితి వరకు వివిధ హోదాలలో పని చేశారు. ఆఫ్రికా, అరబ్‌ దేశాలతో భారత్‌ చేసుకున్న చరిత్ర్మాక వాణిజ్య ఒప్పందాల్లో కీలకపాత్ర పోషించారు. ప్రపంచ వాణిజ్య సంస్థలోనూ భారత ప్రతినిధిగా వ్యవహరించిన శ్రీకర్‌రెడ్డి వియత్నాం, స్విట్జర్లాండ్‌లలో కూడా విధులు నిర్వహించారు. ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సి్‌సకోలో కాన్సుల్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. శ్రీకర్‌రెడ్డి నియామకంపై ఖతార్‌లోని ప్రవాసీ తెలుగు సమాజం సంతోషం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 06:11 AM