ప్రవాస తెలుగు దంపతుల దాతృత్వం
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:57 AM
లుగు మూలాలున్న ప్రవాస భారతీయులైన అనురాధ, వికాస్ సిన్హా దంపతులు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్...
అమెరికాలోని వర్సిటీకి రూ.190 కోట్ల విరాళం
వాషింగ్టన్, సెప్టెంబరు 9 : తెలుగు మూలాలున్న ప్రవాస భారతీయులైన అనురాధ, వికాస్ సిన్హా దంపతులు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సా్‌సకు 20 మిలియన్ డాలర్లు(రూ.190 కోట్లు) విరాళంగా ఇచ్చారు. దీంతో ఆ దంపతులకు గౌరవంగా అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ పేరిట యూనివర్సిటీలో కళాశాల ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్, ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో వికాస్ సిన్హా విద్యాభ్యాసం జరిగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లిన సిన్హా.. ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్ పొందిన వికాస్ సిన్హా.. బ్రాడ్‌కామ్‌లో మెయిన్ ఫ్రేమ్ సాఫ్ట్‌వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..