Share News

ట్రంప్‌కు బిగ్ షాక్... టారిఫ్‌లను కొట్టేసిన యూఎస్ సుప్రీం కోర్టు

ABN , Publish Date - Feb 20 , 2026 | 08:52 PM

అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లను యూఎస్ సుప్రీం కోర్టు కొట్టేసింది. సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ట్రంప్‌కు బిగ్ షాక్... టారిఫ్‌లను కొట్టేసిన యూఎస్ సుప్రీం కోర్టు
Supreme Court

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లను యూఎస్ సుప్రీం కోర్టు(US Supreme Court) కొట్టేసింది. టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్‌హౌస్‌కు కానీ లేదని ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని యూఎస్ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక సుప్రీం కోర్టు తీర్పుతో యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మరోవైపు ఇప్పటికే ట్రంప్.. భారత్‌పై 18 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. భారత్‌పై విధించిన 18 శాతం సుంకాలు కూడా అనధికారమేనని సుప్రీం పేర్కొంది.


అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై సుంకాలకు సంబంధించి ట్రంప్ దూకుడుగా వ్యవహరించడం అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం-1977కి విరుద్ధమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ వెల్లడించారు. అయితే సుంకాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆరుగురు, అనుకూలంగా ముగ్గురు జడ్జిలు విడివిడిగా తమ తీర్పును ఇచ్చారు. సుంకాలతో సహా పన్నులు విధించే అధికారాన్ని రాజ్యాంగం యూఎస్ కాంగ్రెస్‌కు మాత్రమే ఇచ్చిందని, కార్యనిర్వాహక శాఖకు కాదని ఈ సందర్భంగా న్యాయస్థానం వెల్లడించింది. జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఇలా సుప్రీం కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడం అరుదైన ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


ఇవీ చదవండి:

ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. ట్రంప్‌నకు షాకిచ్చిన బ్రిటన్

భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట అదే మాట

Updated Date - Feb 20 , 2026 | 09:45 PM