Share News

సుందర్‌ పిచాయ్‌కు స్టాన్‌ఫోర్డ్‌లో నిరసన

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:31 AM

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో నిరసన ఎదురయింది. ఆయన ఆదివారం 135వ స్నాతకోత్సవ ప్రసంగం చేసే సమయంలో..

సుందర్‌ పిచాయ్‌కు స్టాన్‌ఫోర్డ్‌లో నిరసన

కాలిఫోర్నియో, జూన్‌ 15: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో నిరసన ఎదురయింది. ఆయన ఆదివారం 135వ స్నాతకోత్సవ ప్రసంగం చేసే సమయంలో పాలస్తీనా అనుకూల విద్యార్థులు నినాదాలు చేస్తూ అడ్డుతగిలారు. వందమందికిపైగా విద్యార్థులు ఆయన ప్రసంగాన్ని బహిష్కరించి, వాకౌట్‌ చేశారు. ఇజ్రాయెల్‌తో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విషయమై గూగుల్‌ కుదుర్చుకున్న ప్రాజెక్టు నింబ్‌సకు వ్యతిరేకంగా ఈ నిరసన తెలిపారు. పాలస్తీనాకు స్వాతంత్రం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మిలటరీకి చెందిన డిజిటల్‌ కార్యకాలపాలను గూగుల్‌, అమెజాన్‌లు నిర్వహించే క్లౌడ్‌ నెట్‌వర్క్‌లకు బదిలీ చేయడమే ప్రాజెక్టు నింబస్‌ ఉద్దేశం. దీనిపై పిచాయ్‌ స్పందిస్తూ ఆశావహ దృక్పథంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఇలాంటివి చూసినప్పుడు తనకు ప్రతి తరం ఏదో ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటోందని భావిస్తానని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా

Updated Date - Jun 16 , 2026 | 05:31 AM