ప్రతి బిడ్డకూ 55 వేల డాలర్లు
ABN , Publish Date - Aug 26 , 2026 | 07:00 AM
పిల్లలు వద్దంటూ నిన్నటిదాకా ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తించిన ప్రపంచానికి ఇప్పుడు వారే ముద్దయ్యారు. తరిగిపోతున్న...
జననాల రేటు వృద్ధి కోసం సింగపూర్ వినూత్న పథకం
సింగపూర్, ఆగస్టు 25: పిల్లలు వద్దంటూ నిన్నటిదాకా ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తించిన ప్రపంచానికి ఇప్పుడు వారే ముద్దయ్యారు. తరిగిపోతున్న జననాల రేటు, భయపెడుతున్న వృద్ధ జనాభా సింగపూర్‌ను సైతం వినూత్న ఆలోచనలు చేసేందుకు ప్రేరేపిస్తున్నాయి. ఇందులో భాగంగా, పుట్టే ప్రతి బిడ్డకూ 55వేల సింగపూర్ డాలర్ల (రూ.41 లక్షలు) చొప్పున ఆ దేశం నజరానా ప్రకటించింది. బిడ్డకు 17 ఏళ్లు వచ్చేవరకు ఏటా ఈ నగదు అందుతుంది. ‘‘బిడ్డ పుట్టగానే బేబీ గిఫ్ట్ కింద వెంటనే 10 వేల సింగపూర్ డాలర్లు (రూ.7లక్షలు) అందిస్తాం. 17 ఏళ్లు నిండేవరకు ఏటా 55వేల డాలర్లు చొప్పున ఇస్తాం. ఆ తర్వాత కూడా ఉన్నత విద్యను పూర్తి చేయడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. విద్య, ఆరోగ్యం, బిడ్డల సంరక్షణ నుంచి నర్సరీలో ఫీజుల తగ్గింపు దాకా తల్లిదండ్రులకు కూడా అదనపు గ్రాంట్లు అందిస్తాం. మాతృత్వ సెలవులను కూడా పెంచుతాం’’ అని సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రకటించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!