హసీనా స్వచ్ఛందంగా వెళ్లడం, ఆమెను అప్పగించడం ఒకటి కాదు.. భారత్ కీలక ప్రకటన..
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:00 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లే అంశంపై భారత్ కీలక ప్రకటన చేసింది. హసీనా స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లాలనుకోవడం, ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అధికారిక అభ్యర్థన రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లే అంశంపై భారత్ కీలక ప్రకటన చేసింది. హసీనా స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లాలనుకోవడం, ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అధికారిక అభ్యర్థన రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసింది. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికే చేసిన అధికార అభ్యర్థనను నిర్దేశిత విధానాల ప్రకారం పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది (Sheikh Hasina Return).
బుధవారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయంపై స్పందించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అప్పగింత అభ్యర్థనను భారత ప్రభుత్వం నిర్దేశిత విధానాల ప్రకారం పరిశీలిస్తోందని చెప్పారు. అదే సమయంలో హసీనా స్వచ్ఛందంగా తన దేశానికి తిరిగి వెళ్లాలనుకుంటే తమ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. డిసెంబర్ 16న హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. అది షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అంశమని చెప్పారు. దీనిపై అంతకుమించి వ్యాఖ్యానించబోమని తెలిపారు (Bangladesh Extradition Request).
2024 ఆగస్టు 5న విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు (India Bangladesh Relations). అప్పటి నుంచి ఆమె భారత్‌లో ఉంటున్నారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విజయ దినోత్సవం సందర్భంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని హసీనా భావిస్తున్నట్లు ఆమె ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను అవసరమైన ప్రయాణ పత్రాల కోసం సంప్రదించినట్లు తెలిపారు. మరోవైపు షేక్ హసీనాను తమకు అప్పగించాలని చాలా కాలంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుతోంది.
ఇవి కూడా చదవండి..
ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..
తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..